/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/aimim.webp)
గుజరాత్, యూపీలో ముస్లింలనే లక్ష్యం చేసుకుని బీజేపీ దాడులు చేయిస్తుందంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ మేరకు గుజరాత్ లోని జునాగఢ్, బులంద్ షహర్ లకు సంబంధించిన రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జునాగఢ్, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లలో ముస్లిం వర్గానికి చెందిన పలువురు యువకులను కొట్టారంటూ ఆరోపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/aimim.webp)
ఓవైసీ విడుదల చేసిన మొదటి వీడియోలో, దర్గా జునాగఢ్ వెలుపల వరుసలో నిలబడి కొట్టుకుంటున్న గుంపును చూడవచ్చు. సాధారణ దుస్తులలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముఖానికి రుమాలు కట్టుకుని, క్యూలో నిలబడిన వ్యక్తులను కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ముస్లిం యువకులు దర్గా కూల్చివేతపై నిరసన వ్యక్తం చేయడంతో.. పోలీసులు అదే దర్గా ముందు ముస్లిం యువకులను కొడుతున్నారంటూ ఓవైసీ ట్వీట్ చేశారు.
हम पर ही ज़ुल्म होगा हम ही ज़ालिम कहलाएंगे।
— Asaduddin Owaisi (@asadowaisi) June 17, 2023
हम को ही मारा जाएगा और हम पर ही मुक़दमे चलाए जाएंगे।
भारत में हिन्दुत्व इंतिहा-पसंदी उरुज पर है, शर्पसंद हिंदुत्ववादियों के शर-पसंदी की कुछ चिंगारी पुलिस विभाग तक पहुंच चुकी है।
उसका जीता जागता मिसाल आजकी 2 ख़बर की सुर्खियां हैं। pic.twitter.com/raaW4NdRDF
ఓవైసీ విడుదల చేసిన రెండవ వీడియోలో బులంద్‌షహర్‌లో, ఒక రోజువారీ కూలీని చెట్టుకు కట్టేసి, గుండు గీయించి బలవంతంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయించినట్లు ఉంది. ఆ తరువాత, దోషులపై చర్యలు తీసుకోకుండా పోలీసుల సానుభూతి చూడండి. సాహిల్ ను జైలుకు పంపారు. ఆయనపై జరుగుతున్న అణచివేతపై ఫిర్యాదు చేస్తే ఎక్కడికి వెళ్లాలి అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు.
दूसरी ख़बर: बुलंदशहर में एक दिहाड़ी मज़दूर को एक दरख़्त से बांध कर पीटा गया और JSR के नारे लगाने पर मजबूर किया गया।बाद में पुलिस की हमदर्दी तो देखिए मुजरिमों के खिलाफ़ कार्रवाई करने के बजाय साहिल को ही जेल भेज दिया।
— Asaduddin Owaisi (@asadowaisi) June 17, 2023
अपने ऊपर हो रहे ज़ुल्म के खिलाफ़ फरयाद लेकर जाए तो कहां जाए? pic.twitter.com/T7iPckN6is
Follow Us