Direct Tax Collection: ప్రభుత్వానికి డబ్బే డబ్బు.. పెరిగిన డైరెక్ట్ టాక్స్ వసూళ్లు.. ఆ లెక్కలివే!

ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్ను (డైరెక్ట్ టాక్స్) ద్వారా భారీగా డబ్బు వచ్చి చేరింది. ఆదాయపు పన్ను శాఖ ప్రకటన ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 17 వరకు కేంద్ర ప్రభుత్వం రూ.18.90 లక్షల కోట్లకు పైగా పన్ను వసూలు చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 20% ఎక్కువ. 

New Update
Direct Tax Collection: ప్రభుత్వానికి డబ్బే డబ్బు.. పెరిగిన డైరెక్ట్ టాక్స్ వసూళ్లు.. ఆ లెక్కలివే!

Direct Tax Collection: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు ప్రత్యక్ష పన్ను అంటే డైరెక్ట్ టాక్స్  వసూళ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ.18.90 లక్షల కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ లెక్క ప్రకారం నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20 శాతం పెరిగాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ మంగళవారం లెక్కలు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు దాదాపు రూ.3.37 లక్షల కోట్ల రీఫండ్‌లను జారీ చేసినట్లు ఆ శాఖ ప్రకటించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు(Direct Tax Collection) 19.88 శాతం పెరిగి రూ.18.90 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటన ప్రకారం తెలుస్తోంది. ఆదాయపు పన్నుశాఖ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో మార్చి 17 వరకు మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు(Direct Tax Collection) రూ.18,90,259 కోట్లుగా ఉన్నాయని, ఇందులో కార్పొరేట్ పన్ను ద్వారా రూ.9,14,469 కోట్లు, రూ.9,72,224 కోట్లు ఉన్నట్లు పేర్కొంది.  ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్ను. సెక్యూరిటీల లావాదేవీ పన్ను (STT) కూడా చేర్చి ఉంది. 

Also Read: స్టాక్ మార్కెట్ లో ఒక్కరోజులో 5 లక్షల కోట్లు ఆవిరి.. మరి ఈరోజు ఎలా ఉండొచ్చు?

3.37 లక్షల కోట్ల రీఫండ్స్..
దీనితో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు దాదాపు రూ. 3.37 లక్షల కోట్ల రీఫండ్స్ కూడా ఇచ్చారు. స్థూల ప్రాతిపదికన రీఫండ్స్ సర్దుబాటుకు ముందు ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 22.27 లక్షల కోట్లు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18.74 శాతం ఎక్కువ. సామాన్యులు టాక్స్ లు  చెల్లించాలని ప్రభుత్వం నిరంతరం విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వ ప్రకటనలకు ఫలితం కనిపిస్తోంది.  ఈసారి మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు(Direct Tax Collection) లక్ష్యాన్ని మించి ఉండవచ్చని ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ చెబుతున్నాయి.

20 శాతానికి పైగా పెరిగింది..
CBDT, '2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు ప్రత్యక్ష పన్నుల సేకరణ తాత్కాలిక డేటా నికర పన్ను వసూళ్లు రూ. 18,90,259 కోట్లుగా చూపగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 15,76,776 కోట్లుగా ఉంది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే 19.88 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్నుల వసూళ్ల(Direct Tax Collection) సవరించిన అంచనాలో మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.19.45 లక్షల కోట్లు వసూళ్లు రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.

Advertisment
తాజా కథనాలు