IPL 2024: ఆడుతూ పాడుతూ ఢిల్లీపై విజయం సాధించిన కేకేఆర్..!

ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా అలవోకగా గెలిచింది. 154 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. కోల్కతా బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ (68) రన్స్ చేయడంతో ఆ జట్టు ఘన విజయం సాధించింది.

IPL 2024: ఆడుతూ పాడుతూ ఢిల్లీపై విజయం సాధించిన కేకేఆర్..!
New Update

ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా అలవోకగా గెలిచింది. 154 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. కోల్కతా బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ (68) రన్స్ చేయడంతో ఆ జట్టు ఘన విజయం సాధించింది.

సునీల్ నరైన్ (15), రింకూ సింగ్ (11) పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (33*), వెంకటేష్ అయ్యర్ (26*) పరుగులతో రాణించడంతో గెలుపును నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు, విలియమ్స్ ఒక వికెట్ తీశారు.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. ముందు బ్యాటింగ్ చేసి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సంవత్సరం నమోదవుతున్న స్కోర్లతో పోల్చుకుంటే ఇది తక్కువ పరుగులే అని చెప్పవచ్చు. ఢిల్లీ బ్యాటింగ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా (35*) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (27) పరుగులు సాధించాడు.

మొదటగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృధ్వీ షా (13), జేక్ ఫ్రేసర్ (12) పరుగులు చేసి నిరాశపరిచారు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ (18) పరుగులు చేశాడు. హోప్ (6), అక్షర్ పటేల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (4), కుమార్ కుషాగ్రా (1), రషీక్ సలాం (8) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో చెలరేగాడు. కీలకమైన వికెట్లు తీసి పరుగులు చేయకుండా ఆపాడు. ఆ తర్వాత.. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ కు తలో వికెట్ దక్కింది. తాజా విజయంతో 9 మ్యాచులు ఆడిన కోల్ కతా.. 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 11 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగులతో ఆరో స్థానంలో ఉంది.

#cricket #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe