Andhra Pradesh: టీజీ వెంకటేష్‌పై ఆర్యవైశ్య మహాసభ సంచలన ఆరోపణలు..

టీజీ వెంకటేష్‌పై ఆర్యవైశ్య మహాసభ ఫైర్ అయ్యింది. మహాసభను సొంత కంపెనీలాగా వాడుకుంటూ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకా నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య మహాసభకు చరిత్రను కాపాడుకోవాల్సి ఉందన్నారు.

Andhra Pradesh: టీజీ వెంకటేష్‌పై ఆర్యవైశ్య మహాసభ సంచలన ఆరోపణలు..
New Update

Arya Vysya Mahasabha: టీజీ వెంకటేష్‌పై ఆర్యవైశ్య మహాసభ ఫైర్ అయ్యింది. మహాసభను సొంత కంపెనీలాగా వాడుకుంటూ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకా నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య మహాసభకు 125 సంవత్సరాల చరిత్ర ఉందని, మహాసభని సొంత కంపెనీలాగా వాడుకుంటున్నారు ఫైర్ అయ్యారు. ఆర్యవైశ్య మహాసభను నిర్వహిస్తున్నామని చెప్పి.. సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో సభ పెట్టారని, దీనిపై సివిల్ కోర్టులో కేసు వేశామన్నారు.

బైలా ప్రకారం తప్పు అని తేలడంతో కోర్టు స్టే ఇచ్చిందన్నారు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. కోర్టు ఆర్డర్‌ని ఉల్లంఘించి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకొన్నారని ఆరోపించారాయన. ఈ అంశపైనా తాము కోర్టుకి వెళ్ళామన్నారు. మహాసభ పేరు పోకూడదనే కోర్టుకి వెళ్ళామన్నారు. బలం ఉందని ఏదిబడిదే అది చేయడం పద్ధతి కాదని, ఎవరైనా, ఎంతటి వారైనా సరే బైలాను ఫాలో అవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. జనవరిలో జిల్లా ఎన్నికలు, మార్చిలో రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతాయని ముక్కాల ద్వారకా నాథ్ తెలిపారు.

ప్రస్తుతం ఇచ్చిన లెటర్ హెడ్‌కి, మహాసభకు ఎటువంటి సంబంధం లేదన్నారు ముక్కాల ద్వారకా నాథ్. మహాసభని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం సరైనది కాదన్నారు. 6వ తేదీన కోర్టు తీర్పు వస్తుందని, నిజం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ద్వారకా నాథ్. 125 సంవత్సరాల చరిత్రని అందరూ కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. కులసంఘాలను అడ్డుపెట్టుకుని లబ్ది పొందాలని చూడడం కరెక్ట్ కాదన్నారు ద్వారకా నాథ్‌. అధికారంలో ఆర్యవైశ్యలకు జగన్ కీలక పదవులు ఇచ్చారని, టీజీ వెంకటేష్ కులసంఘాలను వాడుకొంటున్నారని విమర్శించారు ఆర్యవైశ్య మహా సభ ప్రతినిథులు. గతంలో జరిగినట్లు ఇప్పుడు జరుగడం లేదు కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్యవైశ్యులు ఇబ్బంది పడకూడదు కాబట్టే క్రిమినల్ కేసులకు వెళ్తున్నామని చెప్పారు ద్వారకా నాథ్.

Also Read:

పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..!

నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా?

#arya-vysya-mahasabha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe