/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T211459.929-jpg.webp)
Arshika Goswami: హరియాణాకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక అరుదైన ఘనత సాధించింది. పంచకులకు చెందిన అర్షిక గోస్వామి బాల్య దశలోనే 70కిలోలకు పైగా బరువులెత్తి ఔరా అనిపించింది. తన వెయిట్ కంటే రెట్టింపు బరువులెత్తి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్..
ఇప్పటివరకు అర్షిక గోస్వామి ప్రతిభకు చెందిన వీడియోను రెండు మిలియన్లకు పైగా వీక్షించడం విశేషం. కాగా చిన్నారి ప్రతిభను మెచ్చిన నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. ‘భారత్‌కు మరో స్వర్ణం దొరికింది. ఆమె ప్రతిభకు మేమంతా ఫిదా' అంటూ పొగిడేస్తున్నారు. ఇక ఆమె 2021లో తన ఆరేళ్ల వయసులో 45 కేజీల బరువునెత్తి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకొంది. దేశంలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా పేరు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.