తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు.. ఉద్రిక్తత

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. కొన్ని చోట్ల పోలీసులు, కమలం నేతల మధ్య తోపులాటలు జరిగాయి. కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు.. ఉద్రిక్తత
New Update

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. కొన్ని చోట్ల పోలీసులు, కమలం నేతల మధ్య తోపులాటలు జరిగాయి. మరోపు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన సంద్భంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ నాయకులు ప్రయత్నించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, రైతు రుణమాఫీ తదితర హామీలను విస్మరించి ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ధర్నాకు దిగిన బీజేపీ నాయకులపై దాడి చేసిన బిఆర్ఎస్ నాయకులకు దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని.. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నాగర్ కర్నూల్ బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు కొండ మనెమ్మ, పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలపై బీఅర్ఎస్ కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ ఎన్నికల స్టంట్లో భాగమేనని కొండ మనెమ్మ ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళిత బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ చేతికి బలమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe