Road Accidnet : కొడుకు శవం కోసం 20 రోజులుగా మార్చురీల చుట్టూ.. హైదరాబాద్ లో కన్నీటి కథ!

హైదరాబాద్ లో విషాద సంఘటన జరిగింది. అదృశ్యమైన కొడుకు 20 రోజుల తర్వాత శవంగా దొరకిన ఘటన చాదర్ ఘాట్ లో చోటుచేసుకుంది. తమ కొడుకును మరణాన్ని దాచిపెట్టిన పోలీసులు అలసత్వం చేయడం వల్లే తమ కొడుకు 18 రోజుల అనాథశవంగా పడి ఉన్నాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Road Accidnet : కొడుకు శవం కోసం 20 రోజులుగా మార్చురీల చుట్టూ.. హైదరాబాద్ లో కన్నీటి కథ!
New Update

హైదరాబాద్ లో విషాద సంఘటన జరిగింది. అదృశ్యమైన కొడుకు 20 రోజుల తర్వాత శవంగా దొరకిన ఘటన చాదర్ ఘాట్ లో చోటుచేసుకుంది. తమ కొడుకును మరణాన్ని దాచిపెట్టిన పోలీసులు అలసత్వం చేయడం వల్లే తమ కొడుకు 18 రోజుల అనాథశవంగా పడి ఉన్నాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే 20 క్రితం శ్రవణ్ అనే యువకుడు చాదర్ ఘాట్ పరిధిలో ప్రమాదానికి గురయ్యాడు. 6వ తేదీ అర్థరాత్రి గుర్తుతెలియని కారు శ్రవణ్ ను ఢీకొట్టింది. దీంతో శ్రవణ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రవణ్ ను ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతూ శ్రవణ్ మరణించాడు. దీంతో రోజులు గడిచినా తన కొడుకు ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఈనెల 11 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

20రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. పోలీసులు తమ కొడుకు మరణించాడని చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రమాదం గురించి శ్రవణ్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇవ్వలేదు. చివరకు శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి మార్చురీలో గుర్తించి అప్పుడు పోలీసులు సమాచారం అందించారు. అప్పుడు స్పందించిన పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయారు. రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు దాచి పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు చాదర్ ఘాట్ పోలీసుల తీరుపై ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి 20 రోజులు జరిగినా సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించకపోవడం పై శ్రవణ్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘AI’, Sheeshతో పాటు ఈ ఏడాది డిక్షనరీలో యాడ్‌ అయిన పదాలు ఇవే!

&;

#hyderabad #road-accidnet #23-years-old-man-died #chaderghat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe