Arogya Sri Cards: జగన్ సర్కారు కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటీవల ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా డాక్టర్ వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రచార కార్యక్రమంతో పాటు కొత్తగా రూపొందించిన ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. చెందనున్నారు. సరికొత్త ఫీచర్లతో 1.48 కోట్ల స్మార్ట్‌కార్డులను వైద్యశాఖ ముద్రించింది. దీనిని ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ నేతలు ప్రతీ ఇంటికి వెళ్లి లబ్ధి దారులకు అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా పెద్ద ఆసుపత్రిలో చికిత్స పొందడానికి ఇబ్బంది పడే పేద, మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరనుంది.
ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!
ఆరోగ్యశ్రీకి ఏటా రూ.4వేల కోట్లు కేటాయింపు: మంత్రి రజిని
ఆరోగ్యశ్రీ ద్వారా ఎటువంటి రోగాలకు చికిత్స లభిస్తుంది, సందేహాలను నివృత్తి చేస్తూ ప్రచురించిన పోస్టర్లను గుంటూరులో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని ఆవిష్కరించి ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూసీఎం జగన్ అనేక విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టి వాటిని అమలు చేశారని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే నెల జనవరి 1 నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టేందుకు దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ALSO READ: తెలంగాణ అప్పుల లెక్కలు ఇవే!
సీఎం జగన్ బాధ్యతలు చేపట్టాక ప్రతిఏటా రూ.4వేల కోట్లు చొప్పున ఆరోగ్యశ్రీకి కేటాయించారని ఆమె అన్నారు. గ్రామా క్లినిక్‌లు, పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లతో పాటు వైద్యానికి సంబంధించి నాడు–నేడు కార్యక్రమం కింద రూ.17వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. అలాగే, వైద్య విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 53 వేల పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కొన్ని నెలల్లో మిగత కాలేజీలు కూడా ప్రారంభం అవుతాయని అన్నారు. వచ్చే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.