యంగ్ స్టార్ తో అర్జున్ కుమార్తె లవ్..పెళ్లికి గ్రీన్ సిగ్నల్..!

స్టార్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. తమిళ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతి, ఐశ్వర్య గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో వీరి నిశ్చితార్థ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
యంగ్ స్టార్ తో అర్జున్ కుమార్తె లవ్..పెళ్లికి గ్రీన్ సిగ్నల్..!

Arjun Sarja Daughter Aishwarya Marriage: సౌత్ సీనియర్ హీరో.. యాక్షన్ కింగ్ అర్జున్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి.. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అర్జున్ సర్జా. ఇప్పటికీ ప్రాధాన్యత కలిగిన క్యారెక్టర్ పాత్రలను పోషిస్తు సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ అందరిని అలరిస్తున్నాడు.

Also Read: మెగాస్టార్ కు విలన్ గా రానా?

publive-image

అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. పలు చిత్రాల్లో ఆమె నటించినప్పటికీ సరైన హిట్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఆమధ్య తెలుగులో కూడా హీరోయిన్ గా ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ ను తీసుకున్నారు. ఆ తరువాత అర్జున్ టీమ్ కు.. విశ్వక్ కు క్రీయేటీవ్ డిఫరెన్స్ లు రావడంతో.. ఈ సినిమా నుంచి యంగ్ హీరో తప్పుకున్నాడు.  ప్రస్తుతం తన కుమార్తెను హీరోయిన్ గా నిలబెట్టేందుకు కన్నడ స్టార్ ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ ను హీరోగా పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తోంది.

publive-image

మరోవైపు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెంది యంగ్ స్టార్ తో ఐశ్వర్య పెళ్లి జరగబోతున్నట్టు కోలీవుడ్ సర్కిల్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.  ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఐశ్వర్య పీకల్లోతు ప్రేమలో ఉందని.. వీరి ప్రేమ వివాహానికి అర్జున్, తంబి రామయ్య కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఉమాపతి కూడా పలు తమిళ చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని ప్రచారం జరుగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు