Face app:ఫేస్ యాప్ వాడుతున్నారా..? జరిగే అనర్థాలు తెలిస్తే షాక్ అవుతారు ఇప్పుడు ప్రపంచమంతా ఫేస్‌యాప్ హవా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తాము ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ఈ యాప్‌ని వాడుతున్నారు. అందరూ వారి ఫేస్‌బుక్ వాల్‌పై ముసలివాళ్లలా ఉన్న ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్ని అనర్థాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 08 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Face app: ఈ యాప్ మిమ్మల్ని సంతోషపరచడమే కాదు.. కొన్ని సమస్యల్లో కూడా పడేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఫేస్‌యాప్ యూజర్లు ఫొటోను ఎంచుకుని అప్‌లోడ్ చేస్తారు. దానిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పులు తీసుకొస్తారు. దీనికోసం యాప్ ద్వారా మీరు మీ ఫొటో తీయాల్సి ఉంటుంది. నిజానికి, అలా చేస్తూ మీరు ఈ యాప్‌కు మీ ఫొటోను మాత్రమే ఇవ్వడం లేదు. దానితోపాటు చాలా సమాచారం ఇచ్చేస్తుంటారు. యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఈ ఫొటోను గోప్యంగా ఉపయోగిస్తున్నట్లే అనిపిస్తుంది. ఇది కూడా చదవండి: పీడ కలలు ఎందుకు వస్తాయి..రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? కానీ.. దానిని బహిరంగంగా కూడా ఉపయోగించవచ్చని మీకు తర్వాత తెలుస్తుంది. ఈ యాప్ మీ ఫోన్ నుంచి నోటిఫికేషన్లను తీసుకుంటుంది. తర్వాత ఇదే నోటిఫికేషన్లను అది ప్రకటనలకు ఉపయోగించవచ్చు. యాడ్స్‌లో ఉపయోగించడానికి ఈ యాప్ మీ అలవాట్లు, ఆసక్తులను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుండవచ్చు. అందుకే దీనిని మార్కెటింగ్ ఆయుధంలా కూడా చూస్తున్నారు. ఈ యాప్ ఫోన్లోని ఫొటోలన్నిటినీ యాక్సెస్ చేయగలదని తెలియడంతో చాలా మంది ఆందోళనలో ఉన్నారు. దీన్ని ఓపెన్ చేయగానే ఇంటర్నెట్‌లో తమ ఫొటోలన్నీ అప్‌లోడ్ అయ్యాయని చాలా మంది చెబుతున్నారు. ఫేస్‌యాప్‌పై దర్యాప్తు చేయాలని డిమాండ్లు ఫేస్‌యాప్ గురించి అమెరికా సెనేట్‌లో ఆందోళన వ్యక్తమైంది. ఫేస్‌యాప్‌పై దర్యాప్తు చేయాలని డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలను ఫేస్‌యాప్ కొట్టిపారేసింది. ప్రజల ఫొటోలను శాశ్వతంగా స్టోర్ చేయడం ఉండదని, పర్సనల్ డేటాను సేకరించడం లేదని ఆ కంపెనీ చెబుతోంది. యూజర్స్ ఏ ఫొటోలను ఎంచుకుంటారో వాటినే ఎడిటింగ్ చేస్తామని చెప్పింది. అయితే.. ఫేస్ యాప్‌ను పోలిన నకిలీ యాప్‌లు వస్తున్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సైబర్ భద్రతా సంస్థ కాస్పర్ స్కీ హెచ్చరిస్తోంది. నకిలీ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటే వాటితో పాటే యాడ్ వేర్లు, మాల్వేర్లు కూడా మొబైల్ ఫోన్లో చొరబడతాయని కాస్పర్ స్కీ నిపుణులు చెబుతున్నారు. మొబిడ్యాష్ పేరుతో ఇప్పటికే ఓ యాడ్ వేర్ స్మార్ట్ ఫోన్లలో స్వైరవిహారం చేస్తోందని అన్నారు. దీని ప్రభావంతో ఫోన్ వాడేవారికీ.. కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికీ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. #shocked #face-app మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి