రోజూ నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా..? మీ సమస్యకి కారణం ఇదే! నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్లకు మెగ్నీషియం తప్పనిసరని నిపుణులు అంటున్నారు. రాత్రి వేళల్లో మెదడు కార్యకలాపాలు తగ్గడానికి మెగ్నీషియం సాయపడుతుందని వారు చెబుతున్నారు. అవకాడో, గుమ్మడి గింజలు, ఆకు పచ్చని కూరగాయల ద్వారా మెగ్నీషియం లభిస్తుందని సూచిస్తున్నారు. By Durga Rao 27 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి కంటి నిండా నిద్రలేకపోవడమే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం. మనిషి జీవితంలో ఎన్నో ఒత్తిడుల నుంచి దూరం చేసే అత్యంత సాధారణ మార్గమే హాయిగా నిద్రపోవడం. ఆరోగ్యం బాగా ఉండాలంటే చీకు, చింత లేకుండా నిద్రపోవాలి. అయితే నిద్ర పట్టేందుకు అవసరమయ్యే హార్మోన్ మెలటోనిన్. ప్రతి ఒక్కరి శరీరంలో ఈ మెలటోనిన్ హార్మోన్ నాచురల్‌గా తయారు అవుతుంది. మెలటోనిన్ ఉత్పత్తి కావడానికి ప్రధానంగా ఆరు మార్గాలు ఉన్నాయి. మన చుట్టూ చిమ్మ చీకటి వాతావరణం నెలకొన్నప్పుడు మెలటోనిన్ స్థాయి చెప్పుకోతగ్గంత పెరుగుతుంది. చీకటికి స్పందనగా మెదడులోని పీనియల్ గ్రంధి దీన్ని విడుదల చేస్తుంది. అందుకే దీన్ని నిద్రనిచ్చే హార్మోన్‌గా పిలుస్తారు. ఇలా విడుదలైన హర్మోన్ శరీరమంతటా ప్రయాణించి, మెదడులోని రిసెప్టార్లతో కలుస్తుంది. దీంతో నాడీ సంబంధ క్రియలు మందగిస్తాయి. ఫలితంగా విశ్రాంతి స్థితిలోకి వెళతాం.ఈ హార్మోన్ తగినంత విడుదల అయితేనే ఎక్కువ సమయం పాటు గాఢ నిద్ర ఆవరిస్తుంది. అంతేకాదు నిద్రలో తరచూ లేవడం ఉండదు. అందుకే మెలటోనిన్ విడుదల మంచిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మంచి నిద్ర సాధ్యపడుతుంది. ఈమధ్య కాలంలో కంటికి నిద్రను దూరం చేస్తున్న సాధనాల్లో ప్రధానమైనవి మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌లు. నిద్రపోయే ముందు కనీరం రెండు,మూడు గంటల ముందు వీటికి దూరంగా ఉంటే మంచిది. దాని ఫలితంగా ప్రశాంతమైన నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది.మెలటోనిన్, కార్టిసాల్ మధ్య సంబంధం ఉంది. ఒత్తిడికి దారితీసే కార్టిసాల్.. నారెపినెఫ్రిన్ విడుదలను అడ్డుకుంటుంది. మెలటోనిన్ విడుదల కావడానికి ఇది కీలకం. కనుక కార్టిసాల్ స్థాయి తక్కువగా ఉండాలి. దీనికోసం ఒత్తిడికి దూరంగా ఉండాలి. ద్రలేమి సమస్యతో బాధపడే వాళ్లకు మెగ్నీషియం తప్పని సరిగా ఉండాలి. రాత్ర వేళల్లో మెదడు కార్యకలాపాలు తగ్గడానికి మెగ్నీషియం సాయపడుతుంది. అవకాడో, గుమ్మడి గింజలు, ఆకు పచ్చని కూరగాయల ద్వారా మెగ్నీషియం లభిస్తుంది. #sleeping-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి