రోజులో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తున్నారా..అయితే ఈ టిప్స్ పాటించండి!

బాత్‌రూమ్‌‌కి ప్రతి రెండు గంటలకు ఓ సారి ట్రిప్ వేస్తున్నా, తరచూ మూత్రవిసర్జనకు పరిగెత్తాల్సి వస్తున్నా ఇది నార్మల్ మాత్రం కానే కాదు. ఈ విషయంలో మీరు వెంటనే రియాక్ట్ అవ్వాలి. సమస్య కాదులే అని వదిలేయకూడదు.అలా వదిలేస్తే.. తర్వాత చాలా బాధపడతారు.

రోజులో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తున్నారా..అయితే ఈ టిప్స్ పాటించండి!
New Update

సాధారణ సందర్భాలలో, హ్యూమన్ బ్లాడర్ అనేది మూత్రాన్ని బాత్రూంను విసిట్ చేసే వరకు స్టోర్ చేయగలుగుతుంది. రోజుకు నాలుగు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన జరగడం సాధారణమే. ఫ్రీక్వెంట్ యూరినేషన్ సమస్యలో శరీరం మూత్రవిసర్జన అనే ప్రక్రియపై నియంత్రణ కోల్పోతుంది. ఓవరాక్టివ్ బ్లాడర్ వల్ల ఇలా జరుగుతుంది. మూత్రాన్ని హోల్డ్ చేసుకోలేకపోవడం వల్ల సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్రవిసర్జన అవసరం వస్తుంది.

1. కెగిల్ ఎక్సర్సైజేస్:

తరచూ కెగెల్ ఎక్సర్సైజేస్ చేయడం వల్ల ఫ్రీక్వెంట్ యురినేషన్ సమస్యను డీల్ చేయగలుగుతారు. కెగెల్ ఎక్సర్సైజెస్ ను పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజస్ అని కూడా అంటారు. రిపీటెడ్ గా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ను పట్టి ఉంచడం అలాగే వాటిని విడుదల చేయడం ఇలా చేస్తూ ఉండడం వల్ల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రాంగ్ గా మారతాయి. యురెత్రా అలాగే పెల్విస్ మజిల్స్ ను బలపరచడం వల్ల బ్లాడర్ కు సపోర్ట్ అందుతుంది.

1. కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి లేదా పడుకోండి. కెగిల్ మజిల్స్ ను లొకేట్ చేయండి. ఈ మజిల్స్ అనేవి యురినేటింగ్ సమయంలో యూరిన్ ఫ్లోను ఆపడానికి హెల్ప్ చేస్తాయి.
2. కనీసం ఐదు సెకండ్ల పాటు ఈ మజిల్స్ ను నియంత్రణలో ఉంచండి. నార్మల్ గా శ్వాస తీసుకోండి. ఇలా చేసేటప్పుడు పొట్ట, వెన్ను, పక్కలు అలాగే తొడ కండరాలు బిగుతుగా ఉండకుండా చూసుకోండి.
3. ఐదు సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి.
4. ప్రతి సెషన్ కు పది నుంచి ఇరవై సార్లు చేయండి.
5. రోజుకు కనీసం మూడుసార్లు ఇలా చేయండి.

#best-health-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe