మీరేమైనా మినిస్టరా.. మంత్రి సబితా తనయుడికి నెటిజన్ ఝలక్!

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ కి ఓ నెటిజన్ గట్టిగా ఝలక్ ఇచ్చింది.‘మీరు చూపించిన శ్రద్ధకు అభినందనలు కార్తీక్.. కానీ అది విద్యాశాఖమంత్రికి నేను చేసిన విన్నపం. మీరు సమాధానం ఇచ్చారంటే ఒక వేళ కొంపదీసి మీరు విద్యాశాఖమంత్రా.. అన్నట్టుగా కామెంట్ పెట్టారు. అంతే కాదు కార్తీక్ రెడ్డి తానేదో మంత్రిలా ఫీలవుతున్నారని.. తాను పిల్లలపై ఉన్న కన్సర్న్ తో మంత్రిని అడిగిన చిన్న ప్రశ్నకు వెటకారంగా సమాధానమిస్తున్నారని’ ఆమె పేర్కొన్నారు.

మీరేమైనా మినిస్టరా.. మంత్రి సబితా తనయుడికి నెటిజన్ ఝలక్!
New Update

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ కి ఓ నెటిజన్ గట్టిగా ఝలక్ ఇచ్చింది. మీరేమైనా మినిస్టరా..అని ఫైర్ అయింది. ఇక మ్యాటర్లోకి వెళితే..గత వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లలను స్కూల్స్ పంపించడానికి పేరెంట్స్ జంకుతున్నారు. జలమయమైన రోడ్లు, వరదనీరు, కరెంట్ స్తంభాలతో.. ప్రమాదానికి ఆస్కారం ఎక్కువగా ఉండడంతో స్కూళ్లకు సెలవులు ఇస్తేనే బెటర్ అని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

Are you a minister.. Netizen Jhalak to Minister Sabita's son

ఇక గత వారం పిల్లలు స్కూల్ కి వెళ్లిన తరువాత విద్యాశాఖ సెలవు ప్రకటించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి తల్లి ట్విట్టర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని కోరింది. దీనికి మంత్రి రియాక్ట్ కాలేదు కానీ.. ఆమె తనయుడు మాత్రం కాస్త వెంటకారంగా రిప్లై ఇచ్చాడు. ‘మీ వెటకారం అర్థమయ్యింది. ప్రభుత్వం ఏమీ ట్విట్టర్ లో నడవదని గ్రహించండి. ఇటీవల మంత్రి సెలవులపై 8.15 కి ట్వీట్ చేశారు. కానీ ఆ శాఖ ముందుగానే నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్లో ట్రోలింగ్ చేయడం సులభం. కామన్ సెన్స్ ఉపయోగించండి.’ అని ఆయన ట్వీట్ చేశారు.

దీంతో ఆ తల్లితో పాటు నెటిజన్లకు చిర్రెత్తింది. అంతే.. అసలు రిప్లై ఇవ్వడానికి మీరెవరు.. మీరేమైనా మినిస్టరా.. అని నిలదీశారు. వర్షం వస్తుంది కాబట్టి..విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాక సెలవు ప్రకటిస్తే ప్రయోజనం ఉండదని, ముందుగా స్పందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరామన్నారు. సదరు తల్లి.. ‘మీరు చూపించిన శ్రద్ధకు అభినందనలు కార్తీక్.. కానీ అది విద్యాశాఖమంత్రికి నేను చేసిన విన్నపం. మీరు సమాధానం ఇచ్చారంటే ఒక వేళ కొంపదీసి మీరు విద్యాశాఖమంత్రా.. అన్నట్టుగా కామెంట్ పెట్టారు. అంతే కాదు కార్తీక్ రెడ్డి తానేదో మంత్రిలా ఫీలవుతున్నారని.. తాను పిల్లలపై ఉన్న కన్సర్న్ తో మంత్రిని అడిగిన చిన్న ప్రశ్నకు వెటకారంగా సమాధానమిస్తున్నారని’ ఆమె పేర్కొన్నారు.

దీంతో మంత్రికి తనయుడికి దిమ్మతిరిగినట్లైంది. ఆయన మళ్లీ రిప్లై ఇస్తూ.. ‘తాను ట్రోల్స్ కి మాత్రమే సమాధానం ఇచ్చానని.. పిల్లల పై కన్సర్స్ చూసే తల్లిదండ్రులకు కాదన్నారు. మీరు ట్రోలరా.. లేదంటే కన్సర్స్ ఉన్న తల్లా.. అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని’ సమాధానం ఇచ్చారు. మరోవైపు నెటిజన్లు మాత్రం కార్తీక్ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe