OTT : ఓటీటీలోకి వంద కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సుందర్. C దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీ 'అరణ్మనై 4' ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఈ సినిమా ఓటీటీ హాక్కుల‌ను ద‌క్కించుకుకోగా.. త్వ‌ర‌లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు అధికారికంగా తెలిపింది.

New Update
OTT : ఓటీటీలోకి వంద కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aranmanai 4 (Baak) Movie Comming to OTT : సినీ ఇండస్ట్రీలో హారర్ మూవీస్ కి ఉండే క్రేజే వేరు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్ళీ ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఇటీవలే థియేటర్స్ లో రిలీజై 100 కోట్లు కొల్లగొట్టిన హారర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

ఓటీటీలోకి 'బాక్'

కోలీవుడ్ అగ్ర దర్శకుడు సుందర్. C దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీ ఫ్రాంజైజీ 'అరణ్మయి' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చి ఆడియన్స్ ను అలరించాయి. ఇక రీసెంట్ గా పార్ట్-4 'బాక్' పేరుతో రిలీజ్ చేశారు. తమన్నా, రాశీఖన్నా లీడ్ రోల్స్ లో న‌టించిన ఈ సినిమాకి సుందర్ సి స్వీయదర్శకత్వం వ‌హించాడు.

Also Read : సిద్దార్థ్ – అదితిల పెళ్ళికి ముహూర్తం ఖరారైందా?

మే 3 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా రూ.100 కోట్ల వసూళ్లను రాబ‌ట్టింది. తెలుగులోనూ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఈ సినిమా ఓటీటీ హాక్కుల‌ను ద‌క్కించుకుకోగా.. త్వ‌ర‌లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు అధికారికంగా తెలిపింది.

Advertisment
తాజా కథనాలు