/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/workers-1-jpg.webp)
Arakuloya Tourist workers: ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేర్చాల్సిందేనని రోడ్డెక్కారు. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్
ఇదిలా ఉండగా అల్లూరి జిల్లా అరకులోయ టూరిజం ఐ టి. డి.ఏ కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉన్నట్టుండి ఐటీడీఏ టూరిజం కార్మికులు నిరసన ప్రారంభించారు. డైలీ ఇమేజ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పీఎఫ్ ఈఎస్ సౌకర్యం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్లు చేస్తున్నారు.
Also Read: ‘మమ్మల్ని మీరు పీకేస్తే.. మేం మిమ్మల్ని పీకేస్తాం’.. అంగన్వాడీల హెచ్చరిక.!
ఈ మెరుపు సమ్మెకు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు కార్మిక సంఘాలు. ఈ సమ్మెతో దూర ప్రాంతాల నుండి పర్యాటకానికి వచ్చిన పర్యాటకలు అయోమయంలో పడ్డారు. అల్లూరు జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉన్న అరకులోయ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, చాపరాయి, కొత్తవలస ఫామ్, ఈ సమ్మె కారణంగా మూతపడ్డాయి. కాగా, 6 రోజులుగా తమ డిమాండ్లను తీర్చాల్సిందేనని సమ్మె చేపట్టిన అంగన్వాడీల ఆందోళననే పట్టించుకోవడం లేదు..అలాంటిది ఉన్నట్టుండి మెరుపు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందా? అని ప్రజలు భావిస్తున్నాయి.