APPSC: ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.

New Update
APPSC: ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్

APPSC: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సాంకేతిక విద్యాసేవలకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. మొత్తం 99 పోస్టులుండగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:
పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు: 99
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్- 01
ఆటో మొబైల్ ఇంజినీరింగ్ - 08
బయో-మెడికల్ ఇంజినీరింగ్- 02
కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్- 12
సిరామిక్ టెక్నాలజీ- 01
ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 04
కెమిస్ట్రీ- 08
సివిల్ ఇంజినీరింగ్- 15
కంప్యూటర్ ఇంజినీరింగ్- 08
ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 10
ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 02
ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్- 01
ఇంగ్లిష్ - 04
గార్మెంట్ టెక్నాలజీ- 01
జియాలజీ- 01
మ్యాథమెటిక్స్‌- 04
మెకానికల్ ఇంజినీరింగ్- 06
మెటలర్జికల్ ఇంజినీరింగ్- 01
మైనింగ్ ఇంజినీరింగ్- 04
ఫార్మసీ- 03
ఫిజిక్స్‌- 04
టెక్స్‌టైల్ టెక్నాలజీ- 03

అర్హతలు: సంబంధిత బ్రాంచిలో ఫస్ట్ గ్రేడ్ లో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు: 01.07.2023 నాటికి 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100- రూ.98,400.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ లో దరఖాస్తులు: 29/01/2024 నుంచి 18/02/2024 వరకు.
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.

Advertisment
Advertisment
తాజా కథనాలు