APPSC: గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల! ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దాదాపు 4లక్షల మందికి పైగా హాజరవగా 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయినట్లు తెలిపారు. గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నారు. By srinivas 10 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి APPSC Group 2 Result: ఏపీలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను (APPSC Group II Prelims Results) ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఇందులో 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయినట్లు తెలిపారు. 2557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు. ఈ మేరకు క్వాలిఫై, రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను వేర్వేరుగా అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 4లక్షల మందికి పైగా హాజరవగా గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నారు. ఈ లింక్ క్లిక్ చేసి లిస్ట్ చూసుకోండి.. 124069404-file #appsc-group-2-prelims-exam-results-released మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి