అలర్ట్: ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

APPSC గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు 220 మంది 1:2 కోటాలో ఇంటర్వ్యూలకు ఎంపిక అయ్యారని తెలిపారు.

New Update
అలర్ట్: ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

APPSC Group 1 Results: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని APPSC కార్యాలయంలో చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు 220 మంది 1:2 కోటాలో ఇంటర్వ్యూలకు ఎంపిక అయ్యారని తెలిపారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేశామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించమన్నారు. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులను సెలెక్ట్ చేయగా... స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్టు నియామకంపై త్వరలో ప్రకటిస్తామని సవాంగ్ తెలిపారు.

భానుశ్రీ లక్ష్మీ(బీఏ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీ) మొదటి ర్యాంకు సాధించగా.. భూమిరెడ్డి భవాని(అనంతపురం) రెండో ర్యాంకు, కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న మూడో ర్యాంకు, ప్రవీణ్ కుమార్ రెడ్డి(అనంతపురం, జేఎన్‌టీయూ) నాలుగో ర్యాంకు, భాను ప్రకాష్ రెడ్డి (కృష్ణా యూనివర్సిటీ) ఐదో ర్యాంకు సాధించారు.

గ్రూప్-1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గతేడాది సెప్టెంబర్ 30న 111 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించగా.. కేవలం 19 రోజులలోనే జనవరి 27న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్‌కు 86వేల మంది హాజరుకాగా.. 6,455 మంది మెయి‌న్స్‌ పరీక్షకు అర్హత సాధించారు. జూన్‌ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్‌ పరీక్ష జరిగింది. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! లక్ష రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు