APPSC Group-1 Admit Card : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్-1 సర్వీసుల అడ్మిట్ కార్డ్‌ను ఇవాళ (మార్చి 10) విడుదల చేయనున్నారు. APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ ఈరోజు యాక్టివేట్ అవుతుందని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. psc.ap.gov.in అధికారిక పోర్టల్ నుంచి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. APPSC గ్రూప్-1 రిక్రూట్‌మెంట్-2024 డ్రైవ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ లాగిన్ క్రెడెన్షియల్స్‌తో అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మార్చి 17న ఎగ్జామ్:
APPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష(Group-1 Preliminary Exam) ను మార్చి 17న జరగనుంది. ఆఫ్‌లైన్ పరీక్ష పేపర్ 1 (ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు), పేపర్ 2 (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు) రెండు షిఫ్టులలో జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులవుతారు. మొత్తం 81 పోస్టుల కోసం ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
అడ్మిట్ కార్డ్ 2024ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
స్టెప్ 1: ముందుగా APPSC అధికారిక పోర్టల్ psc.ap.gov.in ని విజిట్ చేయండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో APPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్-2024 డౌన్‌లోడ్ లింక్‌ను సెర్చ్ చేయండి.
స్టెప్ 3: లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4: రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను పూరించండి.
స్టెప్ 5: లాగిన్ ఆధారాలను సమర్పించండి
స్టెప్ 6: APPSC హాల్ టిక్కెట్ 2024 స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.
స్టెప్ 7: భవిష్యత్తు సూచన కోసం హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
Also Read : టీఎస్ ఎడ్‌సెట్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్!