Gautam Sawang: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదించినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో 2019-22 వరకు డీజీపీగా కొనసాగిన సవాంగ్ ఉద్యోగ విరమణకు రెండేళ్ల ముందే డీజీపీ పదవికి రిజైన్ చేశారు. దీంతో సవాంగ్‌కు జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించింది. 2022 మార్చిలో ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టగా ప్రస్తుతం రాజీనామా చేశారు.
అయితే వైసీపీ ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందనడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఇటీవల ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వం సవాంగ్ ను రాజీనామా చేయాలని సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసిందని, కొత్త కమిటీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.