వివిధ పరీక్ష తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ!

ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది.

New Update
APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 6 నోటిఫికేషన్లు!

ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌, గ్రూప్‌ -4 సర్వీసెస్‌ లో వివిధ ఖాళీలు, డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌(ఏపీజే డబ్ల్యూసీఎస్‌ఎస్‌), టెక్నికల్‌ అసిస్టెంట్‌(జేపీ) , అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ తెలుగు, టెక్నీకల్‌ అసిస్టెంట్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్ ..వంటి పోస్టులకు అక్టోబర్‌ 3 న జనరల్ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ పరీక్షను నిర్వహించనున్నారు.

పేపర్‌ 2 పరీక్ష షెడ్యూల్ కు సంబంధించి సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షను ఈ నెల 27 న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్‌ 4 సర్వీసెస్‌ లో వివిధ పోస్టులకు సంబంధించి అక్టోబర్‌ 4 న పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ పరీక్షను వచ్చే నెల 5 న నిర్వహించనున్నారు.

అలాగే జూనియర్‌ ట్రాన్స్‌ లేటర్‌ తెలుగు పరీక్షను కూడా వచ్చే నెల 5 నే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షను ఈ నెల 27 న నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఏపీ మైన్స్‌ అండ్‌ జియోలజీ సబ్‌ సర్వీస్‌ పరీక్షను వచ్చే నెల 5 న నిర్వహిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ పరీక్షను వచ్చే నెల 4 న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌ టికెట్లను సెప్టెంబర్‌ 19 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

Advertisment
తాజా కథనాలు