లీకులు, రూమర్స్ ప్రకారం,ఐఫోన్ 16 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డిఆర్ డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్‌లో హెచ్డీఆర్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.3 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. యాపిల్ ఐఫోన్‌కు సిరామిక్ షీల్డ్, గూగుల్ పిక్సెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వచ్చే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..కెమెరా : ఐఫోన్ 16లో 48 మెగా పిక్సెల్ మెయిన్, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు స్పేషియల్ వీడియో సపోర్ట్‌తో డ్యూయెల్ కెమెరా ఉండనుంది. పిక్సల్ 9లో 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా ఉండవచ్చు. ఏదేమైనా, రెండు పరికరాలను జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత మాత్రమే కెమెరా పనితీరును అంచనా వేయవచ్చు.
పర్ఫార్మెన్స్: మెరుగైన పనితీరు, ఏఐ ఫీచర్ల కోసం, ఐఫోన్ 16 కొత్త ఏ18 ప్రో చిప్సెట్తో వస్తుందని భావిస్తున్నారు. పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ గూగుల్‌కి చెందిన ఇన్-హౌస్ టెన్సర్ జీ4 ప్రాసెసర్‌తో రావచ్చు. రెండు చిప్సెట్లు మెరుగైన జీపీయూ, సీపీయూ, ఎన్పీయూ పనితీరును అందిస్తాయని భావిస్తున్నారు.
ఐఫోన్ 16 దీర్ఘకాల పనితీరు కోసం అప్‌గ్రేడ్ చేసిన 3561 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, గూగుల్ పిక్సెల్ 9 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.
గమనిక:- పైన పేర్కొన్న స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీకులు- పుకార్లపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఫ్లాగ్షిప్ మార్కెట్లో ఏ స్మార్ట్‌ఫోన్ బెటర్ అనే విషయాన్ని ధృవీకరించడానికి అధికారిక స్మార్ట్‌ఫోన్ లాంచ్ వరకు వేచి చూడాల్సిందే. త్వరలోనే మరింత క్లారిటీ రానుంది.
ఇంకో విషయం! హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని వెంటనే ఫాలో అవ్వండి.