Appile Vision Pro: రిపేరుకే రెండు లక్షలు..అసలు ఈ యాపిల్ ప్రొడక్ట్ ఎంతుంటుంది?

యాపిల్ ఇటీవల తీసుకువచ్చిన లేటెస్ట్ ప్రొడక్ట్ యాపిల్ విజన్ ప్రో. రేపటి టెక్నాలజీగా చెబుతున్న ఈ ప్రొడక్ట్ ఖరీదు సుమారు మూడు లక్షల రూపాయలు. కానీ, దీనిని జాగ్రత్తగా చూసుకోమని యాపిల్ చెబుతుంది. ఎందుకంటే, ఇది పాడైతే రిపేరుకు రెండు లక్షల రూపాయలవరకూ అవుతుంది. 

Appile Vision Pro: రిపేరుకే రెండు లక్షలు..అసలు ఈ యాపిల్ ప్రొడక్ట్ ఎంతుంటుంది?
New Update

Appile Vision Pro: మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామని అనుకోండి. దానికి అనుకోకుండా ఏదైనా డేమేజి జరిగితే ఏం చేస్తాం? దగ్గరలో రిపేర్ షాప్ దగ్గరకు లేదంటే సంబంధిత కంపెనీ షోరూమ్ కు వెళ్లి రిపేరు చేయిస్తాం. దానికి ఎంత ఖర్చు అవుతుంది. మహా అయితే వస్తువు ఖరీదులో 25 శాతం (అదీ ఎక్కువ అనుకుంటే) అవుతుంది. లక్షరూపాయల కంప్యూటర్ కూడా ఏదైనా రిపేరు వస్తే 15 నుంచి 20 వేల రూపాయల్లో బాగయిపోతుంది. అక్కడికీ అదీ చాలా ఎక్కువ. కానీ, యాపిల్ తీసుకువచ్చిన ఈ నయా ప్రొడక్ట్ (Appile Vision Pro) పొరపాటున చిన్న డేమేజీ అయితే.. రెండు లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. వామ్మో అనకండి.. దీనిని కొనడానికి అయ్యే ఖర్చు కేవలం మూడు లక్షలు అంతే. అంటే ఈ ప్రొడక్ట్ కాస్ట్ లో దాదాపు మూడో వంతు రిపేరుకు అవుతుంది. అదేంటి అలా? అసలేం ప్రొడక్ట్ అది అని డౌట్ వస్తోంది కదూ. అదేమిటో దాని వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. 

యాపిల్ విజన్ ప్రో.. 
ఇప్పుడు మీకు చెప్పిన ప్రొడక్ట్ యాపిల్ విజన్ ప్రో(Appile Vision Pro). ఇది ఇంకా మన దేశంలో రాలేదు. ప్రస్తుతం అమెరికాలో మార్కెట్లో ఉంది. ఇది ఒక వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్. విజన్ ప్రో హెడ్‌సెట్‌తో మేమిద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటే, మనం ఏదైతే చర్చించుకుంటున్నామో అది మన చుట్టూ ఉన్న స్క్రీన్‌లపై కనిపిస్తుంది. అంతేకాదు.. ఒకేసారి రెండు మూడు వర్చువల్ స్క్రీన్స్ పై మన చేయి కదపడం ద్వారా పని చేసుకోవచ్చు. జస్ట్ చేయి కదపడం.. తలను కదపడం ద్వారా గేమ్స్ ఆడుకోవచ్చు, కంప్యూటర్ పై పని చేయవచ్చు, ఏదైనా సినిమా చూస్తూ ముందుకూ వెనక్కూ కడపవచ్చు. అంతేకాదు మనం ఏదైనా ఒక సినిమా చూస్తుంటే ఆ సినిమాలో మనం కూడా ఒక భాగం అయినట్టుగా కనిపిస్తుంది. దీనికి స్క్రీన్ అవసరం లేదు మన కళ్ళముందే కనబడుతుంది. ఒకవేళ మనం ఏదైనా హిమాలయాల్లో ఉన్న వీడియో చూస్తున్నామనుకోండి.. నిజంగా మనం ఆ మంచుకొండలు మధ్యలో ఉన్న అనుభూతి ఇస్తుంది. ఇది ఒకవిధంగా చెప్పాలంటే (Appile Vision Pro) రేపటి టెక్నాలజీ. భవిష్యత్ లో టెక్నాలజీ ఏవిధంగా మారబోతోందో చూపిస్తున్న ఒక ప్రోడక్ట్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దీని ధర ఏకంగా మన కరెన్సీలో మూడు లక్షల రూపాయల వరకూ ఉంటుంది. ఇది బేసిక్ ధర.. ఒకవేళ వెర్షన్స్ మారితే ధర కూడా పెరుగుతుంది. 

Also Read: అరే.. ఏంట్రా ఇదీ.. ఛీ మెట్రోలో పబ్లిక్ గా వీళ్ళు చేసిన పని చూస్తే.. 

ఇన్సూరెన్స్ లేదా వారెంటీ ఉండదా? 
Apple అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే, Apple Vision Pro కొనుక్కున్నవారు హెడ్‌సెట్‌ను ఇష్టం వచ్చినట్టు ఎక్కడపడితే అక్కడ వదలకుండా ఉండమని సలహా కనిపిస్తుంది.  ఎందుకంటే వినియోగదారులు AppleCare+ సేఫ్టీ  కవరేజీని కలిగి ఉండకపోతే చాలా ఎక్కువ రిపేర్ ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. విజన్ ప్రో గ్లాస్‌కు పగుళ్లు వంటి నష్టాలు $799(సుమారు 65వేల రూపాయలు)రిపేరు ఖర్చు తెస్తాయి.  అంతేకాకుండా, హెడ్‌సెట్‌లోని ఇతర భాగాలకు ఏవైనా నష్టం జరిగితే అది మరింత ఖరీదైనది.  దీని ఖర్చు $2,399 (సుమారు రూ. 2 లక్షల రూపాయలు).

AppleCare+ పాలసీ గురించి చూస్తే కనుక  కవరేజ్ ప్లాన్ కోసం కస్టమర్‌లు రెండేళ్లపాటు $499(సుమారు 40 వేల రూపాయలు) లేదా నెలవారీ $24.99(సుమారు రెండు వేలు) చెల్లించాలి. అయితే, మరమ్మతులు పూర్తిగా ఉచితం కాదు.  Apple అధికారిక వెబ్‌సైట్ ఇప్పటికీ దీని ధర సుమారు $299(సుమారు24 వేల రూపాయలు)  అని పేర్కొంది. అందువల్ల, AppleCare+తో, గ్లాస్ సమస్యలను రిపేర్ చేయడానికి మొత్తం $798(సుమారు 65 వేల రూపాయలు) ఉంటుంది.  ఇది ప్లాన్ కాకుండా కేవలం ఒక్క డాలర్ మాత్రమే తక్కువ. అయితే, AppleCare+ పాలసీని కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే, దెబ్బతిన్న గాజు కాకుండా, AppleCare+ భారీ $2,399(సుమారు రూ. 2 లక్షల రూపాయలు) మరమ్మత్తు ఖర్చును తప్పించడం ద్వారా మనకు ఎక్కువ డబ్బు ఆదా చేస్తుంది. 

అదండీ విషయం.. ఖరీదైన పరికరం.. ఖరీదైన రిపేరు ఖర్చు. కానీ, రేపటి టెక్నాలజీతో.. ఆకట్టుకునే ప్రొడక్ట్ యాపిల్ విజన్ ప్రో.

#technology #apple-vision-pro
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe