/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Ponguleti-Srinivas-Reddy.jpg)
Ponguleti Srinivas Reddy:తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం (AP Government) షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్‌కు APEPDCL నోటీసులు ఇచ్చింది. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై ప్రశ్నించింది. నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తవకపోతే కేంద్రం గ్రాంట్ నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.
Follow Us