YS Sharmila: జగన్ ఇక అధికారంలోకి రాడు.. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై స్పందించాలి: షర్మిల

జగన్ మళ్లీ ఇక అధికారంలోకి రాడని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలి? మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పుచేయడానికి అధికారంలోకి రావాలా? అని విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు.

New Update
YS Sharmila: తిరగబడ్డ బాణం.. అన్నపై షర్మిల పోరాటం ఎందుకు?

YS Sharmila: APCC  చీప్ వైఎస్ షర్మిల తాజా రాజకీయ అంశాలపై మరోసారి స్పందించారు. మాజీ సీఎం జగన్ ఇక అధికారంలోకి రాడన్నారు. 'మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలి ? రుషికొండ ప్యాలెస్ లు కట్టుకోవడానికి అధికారంలోకి రావాలా? మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పుచేయడానికి అధికారంలోకి రావాలా?' అని విమర్శించారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో కుంటుపడే పరిస్థితికి వచ్చిందన్నారు .పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం ఆపివేస్తున్నామని ఆసుపత్రుల నిర్వాహకులు అల్టిమేటం ఇచ్చారన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు.

'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చంద్రబాబు గొప్పు గొప్పలు చెప్పారు కదా. ఇప్పుడేమో ఆరోగ్య శ్రీకి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే ఎలా..? ఆరోగ్య శ్రీ పథకాన్ని జగన్ సైతం నిర్వీర్యం చేశారు. జగన్ హయాంలో దాదాపు రూ.1600 కోట్లు పెండింగ్ లో పెట్టారు. గత 11 నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని..పేదల కోసం YSR ప్రవేశ పెట్టిన పథకం ఆరోగ్య శ్రీ' అన్నారు.

Also Read: పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ 

ఈ పథకం వైద్యవిధానంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే 25 మంది ఎంపీలు బీజేపీకి ఎందుకు ఊడిగం చేస్తున్నట్లు ? మీ మద్దతుతోనే కదా మోదీ గద్దెను ఎక్కింది ? నిధులు కావాలని వెంటనే డిమాండ్ చేయాలన్నారు. తక్షణమే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని.. వీలైనంత వరకు పెండింగ్ బిల్స్ చెల్లించాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని షర్మిల హెచ్చరించారు.

'చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అని ఊరూ వాడా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఒక్క సిక్స్ కూడా అమలుచేయలేదు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకం, రైతు భరోసా, పంట నష్టం పరిహారం ఎప్పటిలోగా అమలు చేస్తారో ప్రజలకు వివరణ ఇవ్వాలి' అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇచ్చినట్లుగా అమలు చేయాలని..లేని పక్షంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు.

Advertisment
తాజా కథనాలు