YS Sharmila : షర్మిల ఎమోషనల్.. కారణం ఇదే..!

ప్రత్యేక హోదాపై భావోద్వేగ పూరిత ప్రసంగం ఇచ్చారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. హోదాపై 10 ఏళ్లుగా ఆంధ్రులను గొర్రెలను చేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. సింహాల లెక్క ఉద్యమం చేయకపోతే హోదా ఎప్పటికీ రాదని పేర్కొన్నారు.

YS Sharmila : షర్మిల ఎమోషనల్.. కారణం ఇదే..!
New Update

YS Sharmila : APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) సీఎం జగన్(CM Jagan) కు సొంత చెల్లైనా ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిజ్ఞ పూనారు. ప్రత్యేక హోదాపై భావోద్వేగ పూరిత ప్రసంగం ఇచ్చారు. హోదాపై 10 ఏళ్లుగా ఆంధ్రులను గొర్రెలను చేశారని ఎమోషనల్ అయ్యారు. సింహాల లెక్క ఉద్యమం చేయక పోతే హోదా ఎప్పటికీ రాదని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు

షర్మిలా మాట్లాడుతూ.. పదేళ్ల తర్వాత హోదా అనే ఊసే లేదని..హోదా అంటే ఏంటో అని వింతగా చూస్తున్నారని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్(Congress) ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకుందని తెలిపారు.. ప్రత్యేక హోదా(Special Status) ఉద్యమాన్ని బుజాన ఎత్తుకున్నది కాంగ్రెస్ అని.. ఉద్యమం ఉవ్వెత్తున జరగక పోతే మనకు హోదా రాదని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో ఏ ఒక్కరూ పోరాటం చేసింది లేదని.. ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. హోదా విషయంలో మనం 10 ఏళ్లు గొర్రెలు అయ్యామన్నారు. అందుకే మనల్ని బలి ఇచ్చారని..మొదటి 5 ఏళ్లు చంద్రబాబు మనలను గొర్రెలను చేశాడని.. తర్వాత జగన్ మరో 5 ఏళ్లు గొర్రెలను చేశాడని వ్యాఖ్యానించారు. సింహాల లెక్క పోరాటం చేయకపోతే హోదా రాదుని పేర్కొన్నారు. పోరాడితే పోయేది ఏమి లేదు..బానిస సంకెళ్లు తప్పా అని డైలాగ్ వేశారు.

ఇద్దరూ ఇద్దరే..

ఇన్నాళ్లు మనం మంచితనం గా ఉన్నది చాలన్నారు. మంచితనం ఉంటే మనకు హోదా ఇచ్చారా? మంచితనంగా ఉంటే పోలవరం కట్టారా? అని ప్రశ్నించారు. ఆంధ్రులను మోసం చేసిన మోడీ(PM Modi) ఒక డి ఫాల్టర్ అని విమర్శలు గుప్పించారు. హోదా వచ్చి ఉంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేదన్నారు. హోదా వస్తె 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చేవని..అభివృద్ధిలో ఎక్కడో ఉండే వాళ్ళమని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాస లేదని..రక్తం పంచుకు పుట్టిన జగన్ ఆన్నకి సైతం అభివృద్ధిపై ధ్యాస లేదు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట ఇచ్చి మడత పెట్టిన ఘనత జగన్ దని దెయ్యబట్టారు. జలయజ్ఞం కింద YSR కట్టిన ప్రాజెక్ట్ లకి దిక్కులేదని..వ్యక్తిగత రాజకీయాల కోసం తాను ఆంధ్రకు రాలేదని చెప్పుకొచ్చారు. తనకు రాజకీయాలు కావాలంటే 2019 లోనే ఇక్కడ పార్టీ పెట్టే దానినని వ్యాఖ్యానించారు. కేవలం హోదా సాధన, విభజన సమస్యల సాధన కోసమే అడుగు పెట్టినట్లు వివరించారు.

Also Read : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నమ్మితే అంతే..!

మొదటి సంతకం ఇదే..

రాహుల్(Rahul) ఇచ్చిన మాట పట్టుకొని YSR బిడ్డ ఆంధ్రలో అడుగు పెట్టిందన్నారు. హోదాపై మొదటి సంతకం పెడతా అని హామీ ఇచ్చారు కాబట్టే వచ్చానని తెలిపారు. హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లేనే లేదన్నారు. హోదా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావని..మన రాష్ట్రానికి భవిష్యత్ లేనే లేదని కామెంట్స్ చేశారు. ప్రత్యేక హోదా మనకు ఊపిరి..ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి..ఊపిరి లేకుండా బ్రతక గలమా ? అని ప్రశ్నించారు.

రాష్ట్రమంతా కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హోదా సాధన వరకు విశ్రమించేది లేదని తేల్చిచెప్పారు.

బీజేపీకి తొత్తులు..

బీజేపీ(BJP) కి రాష్ట్రంలో ఒక్క ఎంపీ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడని అయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఎలుతుందని కామెంట్స్ చేశారు. బాబు, జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని..బాబు అధికారంలో ఉంటే బీజేపీ ఉనట్లేనని. జగన్ ఉన్నా బీజేపీ ఉన్నటే అని అన్నారు. 10 ఏళ్లు దాటిన మనకు రాజధాని లేదని.. ఇది మన రాష్ట్రానికి సిగ్గు చేటు అని పేర్కొన్నారు. మన రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్ళామన్నారు. ఆంధ్ర అభివృద్ధి నాది అని మోడీ హామీ ఇచ్చారని..అయితే, ఏ ఒక్క హామీ సైతం నెరవేరలేదని అన్నారు. కేంద్రంలో పదవులు అనుభవించి హోదా సాధన మరిచారన్నారు. హోదా అంటే కేసులు పెట్టారని గుర్తు చేశారు. ప్రతిపక్షం, పాలక పక్షం బీజేపీకి తొత్తులని దుయ్యబట్టారు. టీడీపి బహిరంగ పొత్తు, జగన్ ది కనపడని పొత్తు అని కామెంట్స్ చేశారు. మోడీకి ఊడింగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీతో ఉన్న అక్రమ పొత్తులకు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త జనాలకు అర్థం అయ్యేలా చెప్పాలని సూచించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు.

#ap-ycp #cm-jagan #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe