AP Volunteers: వాలంటీర్లపై చంద్రబాబు వైఖరేంటి? ఆ హామీ నిలబెట్టుకుంటారా లేక పూర్తిగా తొలగిస్తారా?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను టీడీపీ సర్కార్ ఏం చేయబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తారా? లేక వ్యవస్థనే తొలగిస్తారా? పవన్ చెప్పిన ప్రత్యామ్నాయ ఉపాధి ఏమిటనేది చర్చనీయాంశమైంది.

New Update
AP Volunteers: వాలంటీర్లపై చంద్రబాబు వైఖరేంటి? ఆ హామీ నిలబెట్టుకుంటారా లేక పూర్తిగా తొలగిస్తారా?

AP News: ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవస్థపై ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ పునరాలోచనలు చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేయాలా లేక మరో పద్ధతిలో కొనసాగించాలా? అనే కోణంలో చర్చలు జరుపుతోంది. అంతేకాదు గ్రామ వాలంటీర్ పేరును మార్చి గ్రామ సేవక్, వార్డు వాలంటీర్, వార్డ్ సేవక్ గా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తాం..
ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 'వాలంటీర్లకు భయం వద్దు. మా ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని కొనసాగిస్తాం. ఒక్కొక్కళ్లు రూ.50వేలు జీతం సంపాదించుకునేలా మారుస్తాం’ అని హామీ ఇచ్చారు. ఒక్క వాలంటీరును కూడా విధుల నుంచి తప్పించమని, వానికి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే భారీ మెజార్టీతో ఏర్పడటంతో వాలంటీర్లందరూ తమకు ప్రభుత్వం ఏం చేస్తుందా అన్న ఆసక్తి, ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సీఎం, మంత్రిత్వ శాఖ స్పందించకపోవడంతో వాలంటీర్లలో ఆందోళన అధికమైంది. జూలై 1వ తేదీ నుంచి వాలంటీర్లతో అవసరం లేకుండా సచివాలయ సిబ్బంది సహాయంలో ఇళ్లకే పింఛన్‌ను పంపిణీ చేయడంతో వాలంటీర్లలో ఆందోళన మరింత పెరిగింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటలో ఆందోళల చెందుతున్నారు. రాజీనామా చేసిన వారు తమను తీసుకుంటారో లేదోననంటూ మరింత ఒత్తిడికి లోనవుతున్నారు.

వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి..
ఇక వాలంటీర్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయాంలో విలేజ్ వాలంటీర్లు అని ఒక ప్రైవేటు సంస్థ పెట్టారు. వారంతా పింఛన్‌ను డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. అంతవరకు మంచిదే. కానీ వారు పింఛన్ అందిస్తూ అందులో రూ.100 తీసుకునేవారు. దానికి ఏమైనా పేరు పెట్టుకోంది. అది మాత్రం తప్పు. ఎన్నికల ముందు కూడా వాలంటీర్లు లేకపోతే పింఛన్‌ను ఇంటి దగ్గరే ఇవ్వడం కుదరని పని అని చేతులెత్తేసి దాదాపు 33మంది వృద్దుల మరణాలకు కారణమైంది గత ప్రభుత్వం. ఈసారి వాలంటీర్లు లేరు.. పింఛన్ ఏమైనా ఆగిపోయింది. ఇంటికే వెళ్లింది కదా. పైగా ఒక గంట ముందే చేరింది. ఇక ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి? అని అంతా చర్చించుకుంటున్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తాం. ఎవరూ భయపడొద్దు’ అంటై ధైర్యం చెప్పారు.

ఒక్కొక్క వాలంటీర్ కు 100 ఇళ్ల బాధ్యత..
ఇదిలా ఉంటే.. మూడేళ్లపాటు ఒక్కొక్క వాలంటీర్ కు 100 ఇళ్ల బాధ్యతలు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా మరోవైపు వాలంటీర్ కంటే మెరుగైన ఉద్యోగాలు వారికి కల్పించాలని భావిస్తున్న సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేయాలని, సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీల పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్షేమ పథకాల డబ్బుల పంపిణీలు వాలంటీర్లకు సంబంధం లేకుండా అందివ్వాలని, ఇదే క్రమంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీపైన కూడా చంద్రబాబు సర్కార్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో 1.03 లక్షల మంది రాజీనామా..
ఇక ఏపీలో 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించింది. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియామకం జరిగింది. వీరికి రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించింది. వీరి ద్వారానే పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరిగేది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేలా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చామని నాటి జగన్ సర్కార్ చెప్పింది. అయితే.. వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే.. ఎన్నికల సమయంలో 1.03 లక్షల మంది రాజీనామా చేశారు. వీరిలో చాలా మంది వైసీపీ గెలుపుకోసం పని చేస్తామని ఆ సమయంలో బహిరంగంగానే చెప్పారు.

మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే ధీమాతోనే వీరు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత ఏపీలో ప్రభుత్వం మారడంతో సీన్ రివర్స్ అయ్యింది. రాజీనామా చేసిన వాలంటీర్లు అంతా తమను విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వీరి గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. ఈ నెల పింఛన్ల పంపిణీని సచివాలయ సిబ్బంది ద్వారానే చేపడతామని ప్రభుత్వం ప్రకటన చేయడం ప్రస్తుతం విధుల్లో ఉన్న 1.64 లక్షల మంది వాలంటీర్లలోనూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వాలంటీర్లను తొలగించాలని పిటిషన్ దాఖలు కావడంతో వీరి భవిష్యత్ మరింత ప్రశ్నార్థకంగా మారిందన్న చర్చ సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు