Half Day Schools: ఏపీ, తెలంగాణాలో ఒంటిపూట బడులు ! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఒంటి పూట బడులు ప్రారంభంకానున్నాయి. మార్చి మొదటి వారం నుంటి ఉష్ణోగ్రతలు పెరగటంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By Durga Rao 13 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Half Day Schools: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో వీలైనంత త్వరగా ఒంటిపూట బడులు నిర్వహించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎండవేడిమికి పడకుండా ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే ఒంటి పూట బడులు నిర్వహించాలని తల్లి దండ్రులు కోరుతున్నారు.. మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. మార్చి 15 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు నిర్వహించాలని డిమాండ్ ఉన్నప్పటికీ.. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మార్చి 18 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు మొదలు కానున్నాయని తెలుస్తోంది. అయితే అన్ని పాఠశాలకు ఒంటి పూట బడులు అమలు చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. Also Read: మానవజాతిని అంతం చేసేది ప్రళయం కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. ఎలా అంటే.. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మంచి నీరు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. దీంతో పాటు పాఠశాలల్లో ఫ్యాన్లు ఉండాలని, వాటి నిర్వహణ సరిగ్గా ఉండాలని విద్యాశాఖ ఆదేశించింది. ఒంటి పూటల బడుల సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. #half-day-schools మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి