మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి..

మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. మద్యం తాగకండి, లేదంటే పోతారని మద్యం బాటిళ్లపై.. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం చేసిన నేనింతే నా ఇష్టం, మనల్ని ఎవడ్రా ఆపేదంటే మాత్రం మద్యం బాబులు పప్పులో కాలేసినట్టే...అంతేకాదు అదేపనిగా..మద్యం తాగేవారుంటే వారికి ఓ స్యాడ్ న్యూస్, ఎందుకంటే తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి.

New Update
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి..

ap-telangana-shocking-news-for-alcohol-lovers-sensational-things-in-the-study

ఆ.. ఓ రెండు పెగ్గులు తాగితే ఏం అవుతుంది. నేను నార్మల్ బ్రాండ్ తాగను నాకేం కాదులే. తాగిన తర్వాత మంచి ఫుడ్ తీసుకుంటే ఏం కాదని కొంతమంది మందుబాబులు ఆల్కహాల్ హాబిట్ ను సమర్ధించుకుంటారు. అయితే ఇలాంటి మద్యం ప్రియులకు షాకిస్తూ ఓ తాజా సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్, పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధన సంచలన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. సుమారు 5లక్షల మందిపై ఈ సంస్థ ఓ అధ్యయనం చేసింది. మద్యం 28 రోగాలకు కారణమని తేల్చి చెప్పింది.

ప్రత్యక్షంగా 61, పరోక్షంగా 206 వ్యాధులు

ప్రత్యక్షంగా 61, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఎంత మోతాదులో తాగినా.. శరీర అవయవాలపై దాని చెడు ప్రభావం చూపుతుందని సర్వే తెలిపింది. మద్యం కారణంగా ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారని సర్వేలో పేర్కొంది. మద్యం తాగే వారి జన్యు విశ్లేషణ, 12 ఏళ్ల ఆసుపత్రి రికార్డులను పూర్తిగా అధ్యయనం చేసి ఈ రిపోర్టును సంస్థ తయారు చేసింది. నాడీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్లు, ఇన్‌ఫెక్షన్లు, రోగనిరోధక వ్యవస్థ, హర్మోన్, పోషక, జీవక్రియల సంబంధిత వ్యాధులు ఆల్కహాల్‌తో వస్తాయని రిపోర్టులో తెలిపింది. రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణకోశం, చర్మం, కండరాలు, జననేంద్రియాలు వాటి అంతర్భాగాల్లో వ్యాధులు సోకుతాయని సర్వేలో తెలిపింది.

నాడీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్లు, ఇన్‌ఫెక్షన్ల ప్రభావం

మద్యపానంతో లివరేకాదు... నోరు, పెదవులు, స్వర పేటిక, అన్నవాహిక, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్స్ బారినపడే ప్రమాదముందని స్టడీస్ చెబుతున్నాయి. రక్తనాళాలు పాడై....ఎన్నో రకాల క్యాన్సర్లకు దారి తీస్తుందని చెబుతున్నారు. మద్యాపానంతో శరీరంలోని మొత్తం మెటాబాలిజమ్ దెబ్బతింటుందని డాక్టర్స్ చెబుతున్నారు. రా అల్కహాల్ తోనూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు