AP News: అమిత్‌షాను లోకేష్ కలిసింది అందుకే.. అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు

అమిత్‌షా దేశానికి కేంద్రమంత్రి కాబట్టి ఆయనను నారా లోకేష్ కలిసి చంద్రబాబు కేసులకు సంబంధించిన అన్ని వివరాలను వివరించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదనీ అమిత్‌షా ఈ సందర్భంగా లోకేష్ తో చెప్పారని వివరించారు. ఉత్తరాంధ్ర ప్రకృతి వనరులను దోచుకోడానికే జగన్ విశాఖ వెళ్తున్నాడని ధ్వజమెత్తారు.

New Update
AP News: అమిత్‌షాను లోకేష్ కలిసింది అందుకే.. అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఎన్నికనూ.. ప్రజామోదంతో గెలవలేదని టీడీపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అమరావతిలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని టీడీపీ కోరుకుంటోందన్నారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారని మేము ముందే చెప్పామని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్షాల ఓట్లన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. అందుకే ఓటర్‌ల జాబితాపై ముందు నుంచి ఫిర్యాదు చేస్తున్నామని ఆయన అన్నారు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సీఈసీకి ఫిర్యాదు చేశారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. పర్చూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఅర్ నమోదు చేసినా తదుపరి చర్యలు లేవని ఆయన మండిపడ్దారు.

తెలుగు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన

అందుకే ఆయా ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉరవకొండలో జరిగిన అక్రమాలపై ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. వాలంటీర్‌లు ఫార్మ్-6 ద్వారా, ఫార్మ్-7 ద్వారా దరఖాస్తులపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కోరినట్లు తెలిపారు. 57 మంది వెయ్యి కంటే ఎక్కువ మందిని ఓటర్లగా చేర్చే ప్రయత్నం చేశారు మీనాకు తెలిపారు. నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని ఆయన మండిపడ్డారు. ఆయనను అరెస్టు చేయగానే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. జగన్‌ను అరెస్టు చేసినప్పుడు అయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ బయటకు రాలేదన్నారు. చంద్రబాబు అరెస్టు విషయం బుమరాంగ్ అయ్యింది కాబట్టి నాటకాలు అడారన్నారు. నేను విదేశాల్లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తివేశారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

అక్కడ భూములు దోచుకోవడం కోసమే

అమిత్‌షా దేశానికి కేంద్రమంత్రి కాబట్టి ఆయన్ను కలిసి అన్ని వివరాలనూ లోకేష్ వివరించాన్నారు. అరెస్టు విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదనీ అమిత్‌షా చెప్పారని అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం జగన్ ఉత్తరాంధ్రను, విశాఖను మరోమారు మోసం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆపడానికి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది..? అని ప్రశ్నించారు. అక్కడి ప్రాజెక్టులకు ఒక్క పైసా నిధుల ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రకృతి వనరులను దోచుకోడానికి తప్పితే జగన్ ఎందుకు.. అక్కడికి వెళ్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌కు బెంగుళూరు, తాడేపల్లి, హైదరాబాద్‌లో ఇళ్లులు ఉన్నాయని..  ఇప్పుడు రుషి కొండపై కూర్చుని ఇతరుల ఆస్తులు దోచుకోడానికి విశాఖ వెళ్తున్నాడని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు.. ఏపీ కోర్టులో సంచలన తీర్పు

Advertisment
Advertisment
తాజా కథనాలు