YCP Offices Scam : వైసీపీ ఆఫీసుల నిర్మాణం.. మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్?

నిర్మాణాల్లో ఉన్న వైసీపీ ఆఫీసులకు నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26 జిల్లాల్లో వైసీపీ ఆఫీసుల నిర్మాణం చేపట్టగా.. ఒక్కదానికి కూడా అనుమతి లేదని తెలుస్తోంది. ఇదంతా మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్ అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

YCP Offices Scam : వైసీపీ ఆఫీసుల నిర్మాణం.. మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్?
New Update

Scam : నిన్న తాడేపల్లి (Tadepalle) లో నిర్మాణంలో ఉన్న వైసీపీ (YCP) ఆఫీస్ కూల్చివేత రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య మాటల తూటలు పేలుతున్నాయి. ఈ వేడి చల్లారక ముందే.. పలు జిల్లాలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ (TDP) ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు చెబుతుండగా.. అనుమతులు లేకపోవడం కారణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే.. వైసీపీ ఆఫీస్ కూల్చివేతలు, నోటీసులకు సంబంధించి వెలుగులోకి అనేక సంచలన విషయాలు వస్తున్నాయి. పార్టీ కార్యాలయాల పేరుతో వందల కోట్ల భూములు కొట్టేశారని వైసీపీపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

26 జిల్లాల్లో చేపట్టిన పార్టీ ఆఫీసుల నిర్మాణాల్లో ఒక్క దానికి కూడా వైసీపీ అనుమతులు తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో, నగరం నడిబొడ్డున రెండేసి ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకు భూములు రాయించుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం వైసీపీ రాయించుకున్న భూముల విలువ రూ.900 నుంచి రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిషేధిత భూములు, ఇరిగేషన్ భూములు, చెరువు భూములు, దేవాలయ, అసైన్డ్ భూములను యథేచ్ఛగా కేటాయించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఖర్చు పెట్టాలని వైసీపీ భావించినట్లు తెలుస్తోంది. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నీచర్ రిచ్‌గా ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. భూముల విలువ, భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులు కలిపితే కనీసం రూ. 2000 కోట్లు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయం ఒక్కో ప్యాలెస్‌లా ఉండాలన్నది జగన్ (YS Jagan) ఆలోచన అని తెలుస్తోంది. ఇదంతా దోచుకున్న సొమ్ముతో చేపట్టారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read : భూ సమస్యల పరిష్కారానికి త్వరలో కొత్త చట్టం.. !

#ys-jagan #ap-ycp #ap-tdp #tadepalle
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe