AP TDP Leaders Arrest: టీడీపీ లీడర్స్ అరెస్ట్..ఏపీలో హై టెన్షన్..! ఏపీలో హై టెన్షన్ నెలకొంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP TDP Leaders Arrest: ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేశారు.దీంతో టీడీపీ ఆందోళనల నేపధ్యంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడే టీడీపీ ముఖ్యనేతలను ముందస్తుగా అరెస్ట్ చేసి కట్టడి చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తన నివాసం లోపలికి పోలీసులు రావడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసం తన నివాసం లోపలికి వస్తే ఒక్కొక్క పోలీస్ అధికారి కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. కనీసం నోటీసు లేకుండా పోలీసులు నా నివాసంలోకి ఎలా చొరబడతారని పోలీసులపై కోటంరెడ్డి ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గుండెపోటుకు గురైయ్యాడు. అరెస్టు,.తోపులాట నేపధ్యంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. రామానాయుడు కి ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని ఆయన నివాసం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తు నిరసన చేపట్టారు. ఎన్ టి ఆర్ జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆనంతరం భవానిపురం పోలీసు స్టేషన్ కి తరలించారు. తెలుగు మహిళా అధ్యక్షరాలు వంగలపూడి అనిత చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడిని 16 నిమషాలైనా జైల్లో ఉంచాలనేది ఆయన చిరకాలవాంఛ అని తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. జగన్ లాంటి సైకో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం సిగ్గుచేటన్నారు. జగన్ గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని...నీతి, నిజాయితీ, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ జగన్ కు దాసోహం అయిందన్నారు. చంద్రబాబును అర్థరాత్రి అరెస్ట్ చేయడానికి తనేమైనా బాబాయిని హత్య చేసిన హంతకుడా అని ప్రశ్నించారు. ఆయన యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలు భరోసా కల్పించడాన్ని చూసి ఓర్వలేకే అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై ఎన్నో కేసులు పెట్టి నిరూపించలేకపోయారని...తాడేపల్లి పిల్లి,తాడేపల్లిలో లేకుండా లండన్ నుండి ఆపరేట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ పతనం ప్రారంభమైందని..వంగలపూడి అనిత వ్యాఖ్యనించారు. తెలుగుదేశం పార్టీ కి 175 కు ,175 సీట్లు వచ్చే విధంగా వైసీపీనే వ్యవహరిస్తుందని ఆమె వ్యాఖ్యనించారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్నీ వీరాంజనేయులును ముందస్తు అరెస్ట్ చేయడంతో ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు గన్నీ వీరాంజనేయులు. మాజీ ఎంపీ మాగంటి బాబు, ఏలూరు ఇన్ చార్జీ బడేటి చంటిలను ఏలూరు త్రీ టౌన్ కు తరలించారు. ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాల భారీగా మోహరించారు. తిరుపతిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కుటుంబ సభ్యుల్ని బయటకు పంపించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గంగాధర నెల్లూరు మండలంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు స్వామిదాస్, నాయకులు శేఖర్, పాలసముద్రం మండలంలో రాష్ట్ర ప్రభావశీలుల కమిటీ నాయకులు భీమనేని చిట్టిబాబు..ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు..పెనుమూరు మండల పార్టీ అధ్యక్షులు రుద్రయ్య నాయుడు..వెదురుకుప్పం మండల అధ్యక్షులు లోకనాథ రెడ్డి..కార్వేటినగరం మండల అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్, తదితర టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లూరు క్రాస్ రోడ్డులో భారీగా నిరసనలు చేపట్టారు గంధమనేని. Also Read: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఏంటి? ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటి? #chandrababu-arrest #chandrababu-naidu-arrested #ap-tdp-leaders-arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి