అమెరికాలో భారతీయ ప్రాణాలకు విలువ లేదా? చంపేసి జస్ట్ చెక్ రాసిస్తే సరిపోతుందా? అమెరికాలో భారతీయ ప్రాణాలకు విలువ లేదా? చంపేసి జస్ట్ చెక్ రాసిస్తే సరిపోతుందా? సియాటెల్ చెందిన ఓ పోలీస్ ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోడ్డు ప్రమాదంలో జాహ్నవి అనే యువతిని చంపేసిందే కాక ''ఆమె జస్ట్ కామన్ పర్సన్ చెక్ రాస్తే సరిపోతుంది’’ అంటూ హేళనగా నవ్విన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 15 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Jaahnavi Kandula: అమెరికాలో భారతీయ ప్రాణాలకు విలువ లేదా? చంపేసి జస్ట్ చెక్ రాసిస్తే సరిపోతుందా? సియాటెల్ చెందిన ఓ పోలీస్ ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోడ్డు ప్రమాదంలో జాహ్నవి అనే యువతిని చంపేసిందే కాక "ఆమె జస్ట్ కామన్ పర్సన్ చెక్ రాస్తే సరిపోతుంది" అంటూ హేళనగా నవ్విన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అమెరికాలో ఇతర జాతీయుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారనడానికి ఈ వీడియోనే నిదర్శనమని పలువురు తీవ్రస్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికాకు వెళ్లింది. నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ సియాటెల్ క్యాంపస్ లో ఐటీ సిస్టమ్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది జాహ్నవి . అయితే, ఆమె రోడ్డు దాటుతుండగా ఓ పోలీస్ వాహనం ఢీకొట్టడంతో మృతి చెందింది. ఈ ఘటన జనవరి 23న జరిగింది. అయితే, ఆ అమ్మాయి మరణాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదంటూ అమెరికా పోలీస్ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పోలీసు అధికారి ఆడెరర్ తన సహోద్యోగికి ఫోన్ చేసి మాట్లాడిన కాల్ తన బాడీ కెమెరాలో రికార్డయింది. ఆ రికార్డ్ ప్రకారం.. ‘‘ఆమె చనిపోయింది’ అంటూ నవ్వారు. ‘నో, సాధారణ వ్యక్తే. చెక్ రాస్తే సరిపోతుంది’’ అంటూ మరోసారి నవ్వారు. ‘’11 వేల డాలర్లు. ఆమెకు 26 ఏళ్లు ఉంటాయనుకుంటా. పెద్దగా వేల్యూ లేదు’’ అని అన్నారు. ఆడెరర్ సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యూనియన్‌కు లీడర్ కూడా. గిల్డ్స్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌తో ఆయన ఫోన్‌లో సంభాషించినప్పుడు అది బాడీ కేమ్‌లో రికార్డైంది. అయితే, ఆ రికార్డ్‌లో ఆడెరర్ మాటలు మాత్రమే ఉన్నాయి. సోలన్ ఏం మాట్లాడారో రికార్డ్ కాలేదు. ఈ నేపథ్యంలో కందుల జాహ్నవి మృతి వ్యవహారం, తదనంతర పరిణామాలపై దృష్టి సారించాలంటూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఆ వీడియోలో సదరు పోలీసు అధికారి ఆ అమాయక విద్యార్థిని జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడాడని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఓ నాన్ అమెరికన్ పట్ల ఆ అధికారి అమానవీయ ధోరణిని అందరూ ఖండించాలని, తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం తరఫున ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ కోరారు. ఈ చర్యలు అమెరికాలో ఉన్న భారతీయుల్లో ధైర్యం పెంపొందించేలా ఉండాలని సూచించారు. అమెరికాలో సంబంధిత అధికారులతో దీనిపై చర్చించి, కందుల జాహ్నవి మృతి వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో కేంద్రమంత్రి ఎస్.జై శంకర్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని, జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్ అర్థించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి