BREAKING: చంద్రబాబుకు జైలు అధికారుల బిగ్‌ షాక్.. ఈ విషయంలో కీలక నిర్ణయం..!

చంద్రబాబుకు జైలు అధికారులు గట్టి షాక్‌ ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఇకపై రోజుకు ఒక్క లీగల్‌ ఇంటర్వ్యూకి మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు రెండు లీగల్‌ ఇంటర్వ్యూలకు అనుమతి ఉంది. జైల్లో ఇతరు ఖైదీలకు ఇబ్బంది పెరగడం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
BREAKING: చంద్రబాబుకు జైలు అధికారుల బిగ్‌ షాక్.. ఈ విషయంలో కీలక నిర్ణయం..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. ఇక ఇప్పటివరకు ప్రతిరోజూ చంద్రబాబుకు రెండు సార్లు లీగల్‌ ఇంటర్వ్యూలకు అనుమతి ఉండేది. అయితే ఇక నుంచి రోజుకు ఒక్క లీగల్‌ ఇంటర్వ్యూకి మాత్రమే అనుమతిస్తున్నట్టు జైలు అధికారులు స్పష్టం చేశారు. జైల్లో ఇతరు ఖైదీలకు ఇబ్బంది పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

కారణం ఇదే:
కారాగార పరిపాలనా కారణాల దృష్ట్యా, భద్రతా కారణాలతో ఆయన ఉంటున్న స్నేహ బ్లాక్‌ నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌కి వచ్చినప్పుడు, తిరిగి వెళ్లేంతవరకు ఖైదీలు, ఇతర సిబ్బంది కదలికలు నిలిపివేస్తున్నారు అధికారులు. నిత్యం ఇలానే జరుగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో్ 2వేలకు పైగా ఖైదీలున్నారు. చంద్రబాబు ఒక బ్లాక్‌ నుంచి ఇంకో బ్లాక్‌కు వెళ్లే సమయంలో కదలికలు నిలిపివేయడం వల్ల జైలులోని ఆస్పత్రికి వెళ్లే ఖైదీలుకు ఇబ్బంది ఉంటుందని అధికారులు చెబతున్నారు. అసౌకర్యం కలగడంతో పాటు, ముద్దాయిలు కోర్డ్‌ ప్రొడెక్షన్‌లో తీవ్ర జాప్యంతో ఇతర భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకోని రోజుకు ఒక్క లీగల్‌ ఇంటర్వ్యూ మాత్రమే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

publive-image

ములాఖత్‌కు కోత:
చంద్రబాబు జైలులో ఇచ్చే లీగల్ ములాఖత్‌కు అధికారుల కోత పెట్టాడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించడం కరెక్ట్ కాదంటున్నారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు కారణంగా రద్దు చేస్తున్నామని అధికారులు చెప్పారు. దీనిపై అధికారిక లేఖ కూడా విడుదల చేశారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు లిఖిత పూర్వకంగా తెలిపారు జైలు అధికారులు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖత్ వల్ల ఇబ్బంది అంటూ చెప్పడం పై టీడీపీ మండిపడుతోంది. ఇదంతా కావాలనే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.

ALSO READ: ట్రైన్‌ జర్నీ చేసేవారికి గుడ్‌ న్యూస్‌..దసరాకు 620 స్పెషల్‌ ట్రైన్లు!