AP CID Sanjay Exclusive: మరో ఏడుగురు అరెస్ట్ అవ్వబోతున్నారు.. సీఐడీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు! ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపగా.. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయని చెబుతున్నారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. ఆర్టీవీ(RTV)తో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మరో ఏడుగురు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని.. వారిలో పెద్ద తలకాయాలున్నాయో.. చిన్న తలకాయాలున్నాయో తర్వాత అందరికి తెలుస్తుందని తెలిపారు. By Trinath 17 Sep 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Seven more people are going to be arrested: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ గురించే చర్చ జరుగుతోంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(AP Skill development scam)లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్‌పై వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏసీబీ(ACB) కోర్టులో సీఐడీకి ఫెవర్‌గానే తీర్పు రావడం.. చంద్రబాబు తరుఫు లాయర్లు ఒకదాని తర్వాత మరో పిటిషన్ వేయడం.. జస్టిస్ హిమబిందు చివాట్లు పెట్టడం అందరికి తెలిసిందే. అటు సీఐడీ చీఫ్ సంజయ్(CID Chief Sanjay) వరుస పెట్టి ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారు. చంద్రబాబునాయుడు ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడని చెప్పడానికి చాలా ఫ్రూఫ్‌లు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఆర్టీవీ(RTV)తోనూ మాట్లాడారు. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పారు సంజయ్. ప్రచారాలు పట్టించుకోం: సీఐడీ కళ్ళు మూసుకొని ఉండదంటూ తేల్చిచెప్పారు సంజయ్. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేశ్ పాత్రపై కచ్చితంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. ఈ స్కామ్ జరిగిన సమయంలో లోకేశ్ ఎమ్మెల్సీగా ఉన్నారని గుర్తుచేశారు సంజయ్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్‌లో అగ్రిమెంట్‌లో లేని ఒక కొత్త కంపెనీ వచ్చిందని...PVSP గురించి వ్యాఖ్యలు చేశారు సంజయ్. ఎన్నో కంపెనీలకు అక్రమ సొమ్ము వెళ్ళిందన్నారు. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. ఫేక్ ఇన్ వాయిస్‌లు జనరేట్ చేసి ఆ డబ్బుల్ని అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడుకి వెళ్లే లాగా చేశారని చెబుతున్నారు సంజయ్. బయట జరుగుతున్న ప్రచారాలను తాము పట్టించుకోబోమని తెలిపారు. చంద్రబాబును కస్టడికి ఇస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. పెద్ద బోగస్: స్కిల్ డెవలప్మెంట్ కోపరేషన్ బోగస్ కాదని.. ఈ స్కీమే పెద్ద బోగస్ అని కుండబద్దలు కొట్టినంతా కాన్ఫిడెంట్‌గా కామెంట్స్ చేశారు సంజయ్. ఇదంతా గంట సుబ్బారావు చేశారని.. సిమన్స్ కంపెనీకి 58.8 కోట్లు వెళ్ళిందన్నారు. మొత్తం 241 కోట్ల సోమ్ము స్కామ్ అని చెప్పారు. తప్పు లేకుండా చంద్రబాబు పీఎస్ అమెరికా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు సంజయ్. ఫేక్ ఇన్ వాయిస్‌లు జనరేట్ చేసిన వ్యక్తి దుబాయ్ పారిపోయాడని.. నిందితులంతా చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గర వాళ్లని చెప్పారు. ఆధారాలు లేకపోతే కోర్టు రిమాండ్‌కి ఎందుకు పంపుతుందని ప్రశ్నించారు. ఈ స్కామ్‌లో ప్రభుత్వంలోని పెద్దలే.. డబ్బులు కాజేయడానికి కుట్రపన్నారని తెలిపారు. అసలు అగ్రిమెంటే ఫేక్ అని.. జీవోలో ఏముందో.. అగ్రిమెంట్‌లో ఏముందో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది కదా అని క్వశ్చన్ చేశారు సంజయ్. మొత్తం 37 మంది నిందితులు ఉన్నారని చెప్పారు. ఇక ఈ కేసులో మరో ఏడుగురు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని.. వారిలో పెద్ద తలకాయాలున్నాయో.. చిన్న తలకాయాలున్నాయో తర్వాత అందరికి తెలుస్తుందని చెప్పారు. ALSO READ: చంద్రబాబుకు మద్ధతుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ర్యాలీ..! #ap-skill-development-case #ap-skill-development-scam #ap-skill-development-corruption-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి