TDP Legal cell: చంద్రబాబు అరెస్ట్.. టీడీపీ లీగల్‌సెల్ ఐదు ఫెయిల్యూర్స్ ఇవే..! 2021 కేసులో ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకోలేదు..? అరెస్ట్‌పై 3 రోజుల ముందే సమాచారం వచ్చినా ఎందుకు స్పందించలేదు.? ఇప్పుడివే ప్రశ్నలతో టీడీపీ లీగల్ సెల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పోలీసులు అర్ధరాత్రి వెళ్లి ఉదయం చంద్రబాబును అరెస్టు చేశారని.. మరి టీడీపీ లీగల్ సెల్ లంచ్ మోషన్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. By Trinath 11 Sep 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి TDP Legal cell Failures: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ ఫెయిల్యూర్స్ ఒక్కసారిగా బయటపడ్డాయి. 45ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబుకు సంబంధించిన లీగల్ సెల్ చాలా వీక్‌గా ఉందన్న వాదన వినిపిస్తోంది. పోలీసులు అర్ధరాత్రి వెళ్లి ఉదయం చంద్రబాబును అరెస్టు చేశారని.. మరి టీడీపీ లీగల్ సెల్ లంచ్ మోషన్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదో అర్థం కావడంలేదని.. రిమాండ్ విధించిన కోర్టునే సంప్రదించాల్సిన అవసరం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పై కోర్టును సంప్రదించకుండా జాప్యం వెనుక కారణాలేంటో అర్థంకావడంలేదన్నారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్‌తో ఫైఫ్ ఫెయిల్యూర్స్‌ని చూపిస్తున్నారు. టీడీపీ లీగల్‌సెల్ ఐదు ఫెయిల్యూర్స్ ఇవే: ➊ 2021 కేసులో ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకోలేదు? ➋ అరెస్ట్‌పై 3 రోజుల ముందే సమాచారం వచ్చినా ఎందుకు స్పందించలేదు? ➌ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అరెస్ట్ జరిగినా హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? ➍ బెయిల్ పిటిషన్ ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు? ➎ రిమాండ్‌పై తర్వాత పైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? చాలా లేట్ చేశారు: 2021లో కేసు ఫైల్ ఐతే ముందస్తు బెయిల్‌కు ఎందుకు అప్లై చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిందితుడిగా చంద్రబాబు పేరు వస్తుందని ఊహించలేకపోయారా అని అడుగుతున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబే స్వయంగా తనను అరెస్టు చేస్తారని చెప్పారు. పోలీసులు, వైసీపీ మంత్రులు సైతం అరెస్టు చేస్తామని లీకులు ఇచ్చారు. ఐనప్పటికీ టీడీపీ లీగల్ సెల్ ముందస్తు బెయిల్‌కు అప్లై చేయలేదు. అరెస్టు చేసిన తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. కేసు వాయిదా: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హౌస్ అరెస్ట్‌కి సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు సెప్టెంబరు 12 (మంగళవారం)కి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తూ సెప్టెంబర్ 10 (ఆదివారం) 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు చంద్రబాబును పంపారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించగా, CID తరపున పి. సుధాకర్ రెడ్డి వాదించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ వైద్య సహాయం సిద్ధంగా ఉంచామని.. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఆయన సురక్షితంగా ఉంటారని సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఉన్న 'Z' కేటగిరీ రక్షణకు అదనంగా భద్రత ఉందన్నారు. ప్రాథమికంగా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో హౌస్ అరెస్ట్‌కి సంబంధించి ఎలాంటి నిబంధన లేదన్నాన్నారు సుధాకర్ రెడ్డి. ఇక చంద్రబాబుకుప్రాణహాని ఉందని.. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని లూథ్రా నొక్కి చెప్పారు. కరడుగట్టిన నేరస్థులు జైలులో ఉన్నారని, ఇది ముప్పుగా కోర్టు పరిగణించాలన్నారు. ఇరు పక్షాల వాదన విన్న కోర్టు కేసును సెప్టెంబర్ 12కి వాయిదా వేశారు. ALSO READ: చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీర్పు రేపటికి వాయిదా #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి