Justice Himabindu: జడ్జి హిమబిందుకి ముప్పు ఉందా? భద్రత పెంపు..!

చంద్రబాబు కేసు విచారణతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుకు భద్రత పెంచింది. 4+1 ఎస్కార్ట్ కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎలాంటి భద్రత లేదు. కోర్టుకు వచ్చి, వెళ్లే సమయంలో నిఘా పెట్టారు పోలీసులు.

New Update
Justice Himabindu: జడ్జి హిమబిందుకి ముప్పు ఉందా? భద్రత పెంపు..!

చంద్రబాబు కేసు విచారణతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు(justice hima bindu)కు భద్రత పెంచింది. 4+1 ఎస్కార్ట్ కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎలాంటి భద్రత లేదు. కోర్టుకు వచ్చి, వెళ్లే సమయంలో నిఘా పెట్టారు పోలీసులు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై.. ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబు నాయుడును గ్రాండ్ హౌస్ రిమాండ్ చేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు శ్రీరాములు, పూనవోలు ప్రభాకర్‌లు తమ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఇరు వర్గాల వాదనను విన్నారు.

ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు చంద్రబాబు తరపు న్యాయవాదులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఐడి కార్యాలయంలో ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించేందుకు అనుమతించాలని సిఆర్‌పిసి సెక్షన్ 207 కింద సిద్ధార్థ్ లూథ్రా బృందం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ దాఖలు చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది బృందం తమ వాదనను వినిపించేందుకు ప్రయత్నించగా, న్యాయమూర్తి దీనిపై సీరియస్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ పిటిషన్లు దాఖలు చేసి వెంటనే వాదనలు ప్రారంభించడంపై చంద్రబాబు తరపు న్యాయవాదులపై జస్టిస్ హిమబిందు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: చంద్రబాబుకు రిమాండ్‌ తీర్పు ఇచ్చిన జస్టిస్‌ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా?

నిరంతర పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతోందని, పిటిషన్‌పై ఉత్తర్వులు వెలువడే వరకు వేచి ఉండలేమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జస్టిస్‌ హిమబిందు తెలిపారు. అంతకుముందు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదన్న సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్ట్ ఏకీభవించింది. భద్రతపై చంద్రబాబు తరపు లాయర్లు చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోనికి తీసుకోలేదు. మరోవైపు సోషల్‌మీడియాలో హిమబిందు టార్గెట్‌గా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓ పార్టీ ఆమెపై పనిగట్టుకోని విషం చిమ్ముతోంది. నోటికి వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. ఫేక్‌ వీడియోలు ప్రచారం చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు అదనపు భద్రతను కేటాయించింది.

ALSO READ:చంద్రబాబుకు మరో షాక్.. హౌస్‌ రిమాండ్‌కు కోర్టు నో!

Advertisment
Advertisment
తాజా కథనాలు