టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వాయిదా వేశారు న్యాయమూర్తి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనాల రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది.. ఈనెల 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.. నిజానికి చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. అయితే రిమాండ్ పొడిగించాలని సిఐడి కోర్టులో మెమో దాఖలు చేసింది. చంద్రబాబును వర్చువల్‌గా విచారించిన జడ్జి రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు
CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL
అసలు ఏదీ కలిసిరావడం లేదు:
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ టెరాసాఫ్ట్ టెక్నికల్ కమిటీలో గానీ, టెండర్ అవార్డు కమిటీలో గానీ చంద్రబాబు ప్రమేయం లేదన్నారు. విధాన నిర్ణయాల అమలులో జరిగిన పొరపాట్లకు మాజీ సీఎంను బాధ్యులను చేయడం అన్యాయమని, ఆయనను జైల్లో పెట్టాలనే ప్రభుత్వ ఉద్దేశం రాజకీయ ప్రేరేపితమని వాదించారు. అయితే తగినంత సమయం లేకపోవడంతో న్యాయమూర్తి పూర్తి వాదనలు వినకుండానే విచారణను వాయిదా వేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేశ్ అరెస్టును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 12 వరకు పొడిగించింది. ఇక దాదాపు మూడు వారాలుగా ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్ నేడు ఆంధ్రప్రదేశ్ చేరుకుంటారు. ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సానుకూల నిర్ణయం రాలేదు. దీంతో ఆయన రాజమండ్రి జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చంద్రబాబును లోకేశ్ కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అచ్చెన్నాయుడు ఏం చెప్పారంటే?
బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లోకేశ్ నేరుగా రాజమహేంద్రవరానికి వెళ్తారని చెప్పారు. త్వరలోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి తన యువగాథల పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. అక్టోబర్ 9వ తేదీ లోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని, ఆ తేదీ వరకు నిరసనలు కొనసాగుతాయని, చంద్రబాబు జైలు నుంచి విడుదలలో జాప్యం జరిగితే అక్టోబర్ 10 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక 120 మంది చనిపోయారని, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చనున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. జనసేన పార్టీతో కలిసి పనిచేసేందుకు టీడీపీకి చెందిన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ALSO READ: మాజీ మంత్రి బాలినేని కి పొమ్మనలేక పొగపెడుతున్నారా ?