పంతం నెగ్గించుకున్న ఏపీ..నాగార్జునసాగర్‌లో నీటి విడుదల.! పంతం నెగ్గించుకున్నారు ఏపీ అధికారులు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య నాగార్జునసాగర్ నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. 5వ గేటు ద్వారా 2 వేల క్యూసెక్కులను రిలీజ్ చేశారు. By Jyoshna Sappogula 30 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Nagarjuna Sagar Project: నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హై టెన్షన్ నెలకొంది. ప్రాజెక్ట్ 26 గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఏపీ వైపు వాహనాలు రాకుండా ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. అయితే, తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య తాత్కాలిక విద్యుత్‌తో పంతం నెగ్గించుకున్నారు ఏపీ అధికారులు. కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు. 5వ గేటు ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. కాగా, ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఒకవైపు తెలంగాణలో ఎలక్షన్ హడావిడి నడుస్తోంటే..మరోవైపు కృష్ణ నీళ్ల సమస్యపై ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ నడుస్తోంది. పోలింగ్ రోజునే వాటర్ వార్ జరుగుతుండడంతో ఆందోళన పరిస్ధితి కనిపిస్తోంది. అయితే, ఇంత సడన్ గా నాగార్జున సాగర్ పై ఇప్పుడు వివాదం ఏంటి..? నాలుగున్నరేళ్లుగా లేని అలజడి ఎన్నికల వేళ ఎందుకు? అంటూ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. Also read: తెలంగాణలో జోరుగా పోలింగ్.. తరలి వస్తున్న ఓటర్లు! ఇదిలా ఉండగా.. నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై కేవలం కాంగ్రెస్ నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. మొదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. కావాలనే వ్యూహాత్మకంగా చేశారని మండిపడుతున్నారు. దీని మీద సీఈవో చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధికి కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి