మిచౌంగ్(మిగ్జామ్ అని పిలవాలి) తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అటు వర్షంతో పాటు ఇటు ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు కూడా కుప్పకూలుతున్నాయి. ఇక వర్షం కారణంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరుగుతుండడం బాధాకరం. మరికొందరు వరద దాటికి గల్లంతవుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లవ్వ గెడ్డ కాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. వారిని గెమ్మల లక్ష్మి (52), గెమ్మల కుమార్ (25), మిరియాల కమల (40)గా గుర్తించారు. జిల్లాలోని అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీకి చెందిన వారు. బుధవారం(డిసెంబర్ 6) సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక తుపాను ప్రభావంతో జిల్లాలోని కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.
సైక్లోన్ వీక్ అవుతుంది:
మిచౌంగ్(మిగ్జామ్) తుఫాన్ బలహీనపడి అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే వర్షాలు మాత్రం ఆగే ఛాన్స్ లేదు. రానున్న 12-18 గంటల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు భారీ వర్షపాతం సంభవించవచ్చు. రానున్న 12 గంటల్లో ఇది ఉత్తర-ఈశాన్య దిశగా పయనించి మరింత బలహీనపడనుంది. భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
చెన్నై అతలాకుతలం:
మిచౌంగ్(మిగ్జామ్) తుపాను ప్రభావంతో చెన్నై అతలాకుతలమైంది. వరద నీటిలో కార్లు కొట్టుకుపోయయి. ఇక భారీ వర్షాలతో ఇళ్లు నీట మునిగాయి. ఇంకా వరద నీటిలోనే కార్లు తేలియాడుతున్నాయి. నేషనల్ హైవేపైకి వరద చేరడంతో నీటిలో పాములు దర్శనమిస్తున్నాయి. రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా తమిళనాడులో 12మంది మృతి చనిపోయారు. చెన్నైనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది మృతి చెందగా.. వీరంతా వరదల్లో చిక్కుకుని, భవనం కూలిపోయి, గోడ, చెట్లు మీదపడి చనిపోయారు. ఇంకా వరద నీటిలోనే చెన్నైలోని చాలా ప్రాంతాలు ఉండడం కలవర పెడుతోంది.
Also Read: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 12 మంది మృతి
AP Rains: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!
మిచౌంగ్(మిగ్జామ్) తుపాను మరింత బలహీనపడనుంది. అయితే వర్షాలు తగ్గే చాన్స్ మాత్రం ఇప్పుడే లేదు. రానున్న 12-18 గంటల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు భారీ వర్షపాతం సంభవించవచ్చు.
New Update
Advertisment