YSRCP: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా!

వైసీపీ అధినేత జగన్ కు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. పార్టీతో పాటు గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు ఆయన లేఖ రాశారు. దీంతో రోశయ్య ఏ పార్టీలో చేరుతారనే అంశంపై చర్చ సాగుతోంది.

YSRCP: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా!
New Update

Kilari Rosaiah: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు. కిలారి రోశయ్య 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పొన్నురు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ కీలక నేత, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రను ఆ ఎన్నికల్లో ఓడించి రికార్డు సృష్టించారు రోశయ్య. అయితే.. 2024 ఎన్నికల్లో ఆయనకు మరోసారి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి ఆయనను ఎంపీగా బరిలోకి దించారు జగన్. అయితే.. ఎంపీగా ఆయన ఓటమి పాలయ్యారు.

అయితే.. ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇవ్వకుండా ఎంపీగా పోటీకి దించిన నాటి నుంచే రోశయ్య పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న అంశంపై చర్చ మొదలైంది. నిన్ననే వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లాలో ముఖ్య నేతలు వరుసగా వైసీపీని వీడడం ఆ పార్టీని కలవరపెడుతోంది.
publive-image

Also Read: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు

#ycp #ys-jagan #ap-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe