AP Politics: జగన్ కు ఊహించని షాక్.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఔట్!

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ ను కలిసి వారు రాజీనామాలను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. నిన్ననే ఆ పార్టీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

New Update
AP Politics: జగన్ కు ఊహించని షాక్.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఔట్!

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ ను కలిసి వారు రాజీనామాలను సమర్పించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు కేవలం 11 సీట్లకే పరిమితమై పుట్టెడు కష్టాల్లో ఉన్న వైసీపీని వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వీరంతా అధికార టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. చేరికల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీలోకి వచ్చే వారంతా రాజీమానా చేయాల్సిందేనని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లను మాత్రమే దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో  రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చినా ఆ పార్టీ ప్రభావం చూపే అవకాశమే లేదు.

దీంతో టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసినా వచ్చే నష్టం ఏం ఉండదని టీడీపీ భావిస్తోంది. ఉప ఎన్నికల్లో ఆ స్థానాలన్నీ మళ్లీ టీడీపీ ఖాతాలోనే చేరే అవకాశం ఉంది. రాజీనామా చేసిన వారికే మళ్లీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు