ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఎవరు ఎప్పుడు రాజీనామా చేస్తారో.. ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితి దాపరించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి రాజీనామా మరవకముందే విశాఖ గాజువాక(Gajuwaka)లో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది.
కొడుకు దారిలోనే తండ్రా?
గాజువాక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న దేవన్ రిజైన్ చేశారు. ఇక పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. గత ఎన్నికల్లో గాజువాకలో పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఓడించారు తిప్పల నాగిరెడ్డి. ఈ గెలుపు వెనుక ఆయన తనయుడు దేవన్ రెడ్డి పాత్ర కూడా ఉందన్న ప్రచారముంది. ఈ క్రమంలోనే దేవన్‌రెడ్డి రాజీనామా చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది. ఆళ్ళ రామకృష్ణరెడ్డి(Alla Ramakrishna Reddy) రాజీనామా తర్వాత దేవన్ రాజీనామాతో వైసీపీలో కలవరం మొదలైంది.
వ్యక్తిగత కారణాలతోనేనా?
వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆళ్ల రామకృష్ణరెడ్డి చెప్పారు. రాజీనామా అనంతరం ఆళ్ల మాట్లాడుతూ.. రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం కల్పించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. నీతి నిజాయితీతో ధర్మంగా శాసనసభ్యుడిగా పనిచేశానన్నారు. ఒక వైపు బాధగా ఉన్నప్పటికీ.. కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇన్నాళ్లు తనకు రాజకీయంగా అవకాశం కల్పించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి (AP CM Jagan) ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి కోసం పనిచేశానన్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి సత్తెనపల్లి టికెట ఆశించి భంగపడ్డనని గుర్తు చేశారు. తర్వాత 2009 లో పెదకూరపాడు టికెట్ ను ఆశించినా.. దక్కలేదన్నారు.
Also Read: సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.. అసలు ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసా?
WATCH: