Minister Roja: భువనేశ్వరి కోరుకున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే.. మంత్రి రోజా సైటర్లు!

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రేపటి నుంచి చేయనున్న నిజం గెలివాలి యాత్రపై ఏపీ మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. భవనేశ్వరితో పాటు తాము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామన్నారు. భువనేశ్వరి కోరుకుంటున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైళ్లోనే ఉంటాడని సెటైర్లు వేశారు. నిన్న జరిగిన జనసేన-టీడీపీ మీటింగ్ పాడుతా తీయగా ప్రోగ్రామ్ సెలక్షన్స్ ను తలపించిందని రోజా ఎద్దేవా చేశారు.

New Update
Minister Roja: భువనేశ్వరి కోరుకున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే.. మంత్రి రోజా సైటర్లు!

'నిజం గెలవాలి' పేరుతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) రేపటి నుంచి చేయనున్న యాత్రపై ఏపీ మంత్రి రోజా (AP Minister Roja) సెటైర్లు వేశారు. నిజం గెలవాలని నారా భువనేశ్వరితో పాటు తాము కూడా కోరుకుంటున్నామన్నారు. భువనేశ్వరి కోరుకున్నట్లు నిజం గెలిస్తే చంద్రబాబుకు (Chandrababu) శాశ్వత జైలు జీవితం ఖాయమని ఎద్దేవా చేశారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు కాదు భువనేశ్వరి లోకేష్ సైతం జైలుకి వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. భువనేశ్వరికి నిజంగా నిజం గెలవాలని ఉంటే సీబీఐ ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేశారు. నిన్న జనసేన టీడీపీ సమావేశం చూస్తే పాడుతా తీయగా సెలక్షన్స్ కి కూర్చున్నట్లు అనిపించిందని తనదైన శైలిలో స్పందించారు.
ఇది కూడా చదవండి: రేపటి నుంచే నారా భువనేశ్వరి బస్సుయాత్ర.. నినాదం ఇదే..!

అరసున్న పవన్ మరో అరసున్న లోకేష్ కలిసి గుండు సున్నా అయిన చంద్రబాబు కోసం సమావేశం అయ్యారంటూ ఎద్దేవా చేశారు. ప్రజల చేత చీదరింపబడి ఓటమి చవిచూసిన వీళ్ళా దిశా నిర్దేశం చేసేదని పార్టీ శ్రేణులోనే నవ్వులు పండాయని సెటైర్లు వేశారు. చంద్రబాబు 14ఏళ్ళలో మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఏనాడు నెరవేర్చిన దాఖలాలు లేవని విమర్శించారు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% శాతం పూర్తి చేశారన్నారు.

ఫ్యాషన్ షోలకు వెళ్లే భువనేశ్వరి యాత్రలు పేరుతో ప్రజల్లో ఎలా తిరుగుతుందో అర్థం కావడం లేదని సంచలన వాఖ్యలు చేశారు. తన తండ్రిపై చెప్పులు విసిరి, పార్టీ లాకున్నప్పుడు భువనేశ్వరి హ్యాపీగా ఉన్నారన్నారు. భువనేశ్వరి నిజం గెలవాలని కోరుకోవడం.. చంద్రబాబు జైల్లోనే వుండిపోవాలి అనుకోవడం రెండూ ఒకటే అన్నారు రోజా.

Advertisment
Advertisment
తాజా కథనాలు