Minister Narayana: వైసీపీ ప్రభుత్వం మూడు రాజధాని అంటూ మూడు ముక్కలాటలు ఆడిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. దీంతో ప్రజలకు రాజధాని లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని చంద్రబాబు (CM Chandrababu Naidu) అనుకున్నారన్నారు. టాప్ 5 రాజధానుల్లో అమరావతి (Amaravati) ఉండాలని అనుకున్నామన్నారు. గతంలోనే రాజధానిలో రోడ్లు, మౌలిక వసతులు, నిర్మాణాలు పనులన్ని మొదలు పెట్టామన్నారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవంతో తనకు మళ్లీ మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. పాత మాస్టార్ ప్లాన్ తో రాజధాని (AP Capital) నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
రెండున్నర సంవత్సరాల్లో రాజధాని మొదటి ఫేజ్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గతంలో ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకుని నిర్మాణలు వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇప్పటికే నిర్మాణ సంస్థలతో మాట్లాడానన్నారు. మొత్తం రివ్యూ చేసి.. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వంలో దొంగలించబడ్డ సామాగ్రి, వస్తువులపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు.
రోడ్లు తవ్వుకుని సామాగ్రి దొంగలించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. వీటన్నింటి మీద ఒక కమిటీ వేస్తామన్నారు. తప్పకుండా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సీడ్ క్యాపిటల్ లోని నిర్మాణాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
Also Read: జగన్ కూర్చునే కుర్చీ, పడుకునే మంచం కూడా ప్రభుత్వానిదే.. టీడీపీ సంచలన ట్వీట్!