/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Nara-Lokesh-1.jpg)
అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేసే వ్యక్తి అయ్యన్నపాత్రుడు అని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. స్పీకర్ గా అయ్యన్నపాత్రులు ఎన్నికైన సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఆయనకు గతంలో క్షణికావేశం ఉండేదని.. ఇక ఆ అవకాశం లేకుండా పోయిందని నవ్వులు పూయించారు. 25 ఏళ్ల వయస్సులోనే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారని గుర్తు చేశారు. ఏడు సార్లు ఒక్క నియోజకవర్గం నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం గొప్పవిషయమన్నారు. తాను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న సమయలో అయ్యన్న పాత్రుడి సలహాలు తీసుకున్నానని గుర్తు చేశారు.