/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-Politics-.jpg)
ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో.. వార్ వన్ సైడ్ అవుతుంది, సీఎం వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అవుతారని మంత్రి అమరనాథ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలకు మంత్రి గుడివాడ అమరనాథ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారన్నారు. సీఎం జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారన్నారు. ఓటింగ్ పెరిగిన ప్రతీ సందర్భంలో దివంగత నేత వైయస్, సీఎం జగన్ విజయం సాధించారన్నారు.
మహా కూటమి జత కట్టిన సమయంలోను ఓటింగ్ పెరిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారని గుర్తు చేశారు. గతంలో కంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడిందన్నారు. ప్రతిపక్షాలు ఓడిపోతున్నామన్న ఫస్ట్రేషన్ తోనే గొడవలకు దిగుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకుండా.. వారికి తమ మద్దతు అమరసమయ్యేలా ఉండాలన్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చుసుకోవాలని ఎద్దేవా చేశారు.