ఇక కర్నూలు లోక్‌సభలో పరిస్థితి చూద్దాం. బీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే లోక్‌సభ స్థానం ఇది. టీడీపీ అభ్యర్ధి బస్తిపాటి నాగరాజుకు కులసమీకరణలు ప్లస్ అవుతాయి. కర్నూల్ లోక్‌సభ పరిధిలో కురువ ఓటర్లు ఎక్కువగా ఉండటం నాగరాజుకు కలిసొచ్చే అంశం. వైసీపీ అభ్యర్ధి బి.వై. రామయ్యకి సొంత పార్టీనే ప్రచారంలో కలిసి రావడం లేదన్న టాక్ ఉంది.
వైసీపీలోని కీలక నేతలు కూడా రామయ్యకి అనుకూలంగా లేకపోవడం మైనస్ అవుతోంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు, ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ గెలుస్తుదని మా స్టడీలో చెప్పాం. పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు, ఆదోనిలో వైసీపీ గెలవబోతుందని కూడా ఇప్పటికే క్లియర్ అయింది.
ఓటర్లు ఈ సెగ్మెంట్స్‌లో ఎమ్మెల్యేలుగా వైసీపీ అభ్యర్ధులని గెలిపించినా పార్లమెంట్‌కి మాత్రం టీడీపీ వైపు మొగ్గుతారని మా స్టడీలో తేలింది. మొత్తంగా క్రాస్ ఓటింగ్‌తో కర్నూలు పార్లమెంట్‌లో టీడీపీ అభ్యర్ధి బస్తిపాటి నాగరాజు గెలుస్తారని RTV స్టడీ చెప్తోంది.