AP Land Titling Act: వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఇందుకు సంబంధించిన బిల్ ఈ రోజు శాసనసభలో ఆమోదం పొందింది. ఈ చట్టం రద్దుపై ప్రవేశపెట్టిన బిల్ పై చర్చను రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రారంభించారు. భూమిపై యజమానులకు హక్కు లేకుండా చేయడమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం లక్ష్యంలాగా కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం ఫొటో వేసుకుని పట్టాదార్ పాస్ పుస్తకాలు ఎలా ఇస్తారని ఫైర్ అయ్యారు. ఇది ఓ భయంకరమైన చట్టం అని ధ్వజమెత్తారు.
కూటమి అధికారం లోకి వచ్చిన వెంటనే చట్టాన్ని రద్దు చేస్తామని తాను, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం నల్ల చట్టాన్ని రద్దు చేయడానికి బిల్లు పెట్టామన్నారు. రాష్ట్రం లో ఎప్పుడు లేనంతగా భూ వివాదాలు పెరిగాయన్నారు. 40 ఏళ్లుగా తన కుప్పం అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక్క ఫిర్యాదు రాలేదని చెప్పారు. కానీ గత ఐదేళ్లుగా అక్కడ భూవివాదాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. పట్టాదారు పాసుపుస్తకాలపై కూడా సీఎం ఫొటో వేశారని ఫైర్ అయ్యారు. భూ సర్వే అంటూ డబ్బులు ఖర్చు పెట్టి వివాదాలు పెంచారని గత వైసీపీ సర్కార్ పై ఆరోపణలు చేశారు.