AP IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆ అధికారులకు కీలక బాధ్యతలు! ఏపీలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. 19 మంది ఐఏఎస్‌ల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. By srinivas 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి IAS: ఏపీలో ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌ల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. అటవీశాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌గా రాం ప్రకాష్ సిసోడియాకు బాధ్యతలు అప్పగించారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా జయలక్ష్మి, కన్నబాబుకు సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఇక రోడ్లు, రవాణా, భవనాల ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, మౌలిక సదుపాయాల సెక్రటరీగా సురేష్ కుమార్, మైనార్టీ శాఖ సెక్రటరీగా హర్షవర్ధన్, టూరిజం, సాంస్కృతిక శాఖ సెక్రటరీగా వినయ్ చంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా యువరాజ్, సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా కన్నబాబు, మైనార్టీ శాఖ సెక్రటరీగా హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. #ap-19-ias-officers-transfer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి